Begin typing your search above and press return to search.

సవ్యసాచిలో తమిళ్ స్టార్ హీరో

By:  Tupaki Desk   |   26 Sept 2017 9:31 AM IST
సవ్యసాచిలో తమిళ్ స్టార్ హీరో
X
సవ్యసాచి.. అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్ లో బోలెడంత ఆసక్తి నెలకొంది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని.. థ్రిల్లర్ జోనర్ లోనే ఓ కొత్త కోణంలో తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. ఇప్పుడీ మూవీని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

సఖి చిత్రం నుంచి తెలుగులో కూడా బోలెడంత పాపులారిటీ సంపాదించుకున్న హీరో మాధవన్. ఇప్పటివరకూ డైరెక్ట్ తెలుగు సినిమా ఒకటి కూడా చేయకపోయినా.. ఇప్పుడు సవ్యసాచిలో నటించేందుకు అంగీకరించాడనే టాక్ వినిపిస్తోంది. తన తెలుగు లాంఛింగ్ మూవీపై మాధవన్ కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నాడట. ఇప్పటికే దర్శకుడు చందూ మొండేటి.. స్టోరీపైనా.. మాధవన్ క్యారెక్టర్ పైనా పూర్తి స్థాయి ఇంట్రడక్షన్ ఇచ్చాడట కూడా. తన పాత్ర తీరుపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ హీరో.. తప్పనిసరిగా చేస్తానని మాట కూడా ఇఛ్చాడట.

త్వరలోనే మిగిలిన ఫార్మాలిటీస్ కూడా పూర్తి చేసుకుని తెలుగు సినిమాల్లోకి నేరుగా అడుగుబెట్టబోతున్నాడు మాధవన్. లవర్ బోయ్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన ఈ హీరోకు.. సవ్యసాచి పర్ఫెక్ట్ లాంఛింంగ్ అంటున్నారు. రీసెంట్ గా యుద్ధం శరణం మూవీతో నిరుత్సాహపడ్డ నాగచైతన్య.. సవ్యసాచి చిత్రం కోసం తన సర్వశక్తులు ఒడ్డబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.