Begin typing your search above and press return to search.
'పుష్ప' వార్త నిజం కాదన్న 'నిశబ్దం' స్టార్
By: Tupaki Desk | 30 Sept 2020 9:15 AM ISTఅల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలో కీలక పాత్ర కోసం తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని ఎంపిక చేశారట. షూటింగ్ ఆలస్యం అవ్వడంతో ముందే కమిట్ అయిన సినిమా కారణంగా పుష్ప సినిమా నుండి విజయ్ సేతుపతి తప్పుకున్నాడట. అప్పటి నుండి ఆ పాత్రకు మరో నటుడిని ఎంపిక చేసేందుకు సుకుమార్ పలువురు నటులతో చర్చలు జరుపుతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇటీవల ఆయన మాధవన్ తో కూడా చర్చలు జరిపారంటూ ప్రచారం జరిగింది. తాజాగా ఆ విషయమై మాధవన్ స్వయంగా క్లారిటీ ఇచ్చాడు.
ట్విట్టర్ లో పుష్ప సినిమాలో మాధవన్ నటిస్తున్నాడా అంటూ ప్రశ్నించి మాధవన్ ను ట్యాగ్ చేశారు. అందుకు ఆయన సమాధానంగా నిజం కాదు అంటూ ఒక్క మాటతో తేల్చి పారేశాడు. పుష్ప సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం అవ్వాల్సి ఉంది. అందుకే ఆ పాత్రలో ఎవరు నటిస్తారు అనే ఆసక్తి అందరిలో వ్యక్తం అవుతోంది. పుష్ప సినిమాలోని ఆ పాత్ర కోసం ఇప్పటి వరకు అరవింద్ స్వామి.. నారా రోహిత్.. బాబీ సింహాలతో పాటు కొందరు బాలీవుడ్ స్టార్స్ ను కూడా సంప్రదించారనే వార్తలు వచ్చాయి. చివరకు ఆ పాత్రను ఎవరు చేస్తారో చూడాలి. మాధవన్ క్లారిటీ ఇవ్వడంతో ఈ జాబితా నుండి ఆయన పేరు తొలగి పోయినట్లయ్యింది. రెండు రోజుల్లో మాధవన్ అనుష్కతో కలిసి 'నిశబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.