Begin typing your search above and press return to search.

ఐశ్వర్యతో రొమాన్సుకు కోట్లు అడిగేశాడు

By:  Tupaki Desk   |   13 Sept 2017 12:50 PM IST
ఐశ్వర్యతో రొమాన్సుకు కోట్లు అడిగేశాడు
X
ఇండియన్ హ్యాండ్సమ్ నటుల్లో ఒకరైన మాధవన్ ఇప్పటికే తనదైన శైలిలో పాత్రలు చేస్తూ అలరిస్తున్నాడు. చూడగానే అమ్మాయిల గుండెల్లో ప్రేమను చిగురింపజేసే ఈ నటుడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హీరోగా ప్రతి ఇండస్ట్రీలో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. టాలీవుడ్ లో ఇప్పటికి కూడా మాధవన్ సినిమాలో డబ్ అవుతూ మంచి ఆధరణని దక్కించుకుంటాయి. ఇక బాలీవుడ్ లో స్పెషల్ రోల్స్ కి మాధవన్ ఉండాల్సిందే అంటారు అక్కడి దర్శకులు.

అయితే మాధవన్ ఈమధ్య స్పెషల్ రోల్స్ కి రెమ్యునరేషన్ ని గట్టిగానే డిమాండ్ చేస్తున్నాడట. కథా-కథనం గురించి తెలుసుకోకుండానే ఏ మాత్రం ఆలోచించకుండా భారీ అమౌంట్ ను అడుగుతున్నాడట. రీసెంట్ గా ఇదే తరహాలో ఒక మంచి సినిమాలో రెమ్యునరేషన్ అనుకున్నంత ఇవ్వకపోవడంతో సినిమానుంచి తప్పుకున్నాడట. ఆ సినిమా ఎవరిదో కాదు. ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ మెయిన్ లీడ్ లో నటిస్తున్న ‘ఫ్యానీ ఖాన్‌’ చిత్రం. చాలా రోజుల తర్వాత ఐశ్వర్య ఒక మంచి సినిమాతో రాబోతోంది. అయితే ఈ సినిమాలో ఐషు కి జోడిగా మాధవన్ ని ఫిక్స్ చేశారట.

కానీ మనోడు కేవలం 15 రోజుల షెడ్యూల్ కు మొత్తంగా 1.5 కోట్ల రూపాయలను డిమాండ్ చేయడంతో దర్శక నిర్మాతలకు దిమ్మ తీరిగిందట. దీంతో వెంటనే మాధవన్ స్థానంలో రాజ్ కుమార్ రావ్ ని తక్కువ అమౌంట్ కె ఒప్పించి చేయించారట. హాలీవుడ్‌ ‘ఎవ్రీబడీస్‌ ఫేమస్‌’ అనే చిత్రానికి ఈ సినిమా రీమేక్‌ గా రాబోతోంది. రాకేశ్‌ ఓం ప్రకాశ్‌ మెహ్రా దర్శకత్వం వహిస్తున్నా ఈ సినిమాలో అనిల్ కపూర్ కూడా ఓ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు