Begin typing your search above and press return to search.

చెర్రీ విలన్ గా సఖి హీరో??

By:  Tupaki Desk   |   7 Oct 2015 11:00 PM IST
చెర్రీ విలన్ గా సఖి హీరో??
X
బ్రూస్ లీ ది ఫైటర్ ని... జస్ట్ ఫినిష్ చేశాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రిలీజ్ కి మరో వారం రోజుల గడువు మాత్రమే ఉండడంతో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్నాడు. అయితే బ్రూస్ లీ రిలీజ్ తర్వాత.. చెర్రీ తని ఒరువన్ లో చేయడం ఇప్పటికే ఖాయమైపోయింది. కథ కోసమే ఐదున్నర కోట్లు పోసి కొనేశాడు నిర్మాత.

మూవీ అయితే ఫిక్స్ అయింది కానీ.. ఇందులో విలన్ కేరక్టర్ ఎవరు పోషిస్తారు? తమిళ్ లో అరవింద్ స్వామి చేసిన రోల్ ని.. తెలుగులో ఎవరితో చేయించాలి ? ముందు రాణాని అనుకున్నారు కానీ ఎందుకో తర్వాత ఆ ఐడియా వదిలేశారు. ఆ తర్వాత నాగార్జునని చేయమన్నారని, ఆయన నో అన్నాడనే వార్తలొచ్చాయి. అయితే.. అలాంటి ఆఫర్ ఏదీ రాలేదని తేల్చేశాడు నాగ్. మొత్తానికి ఈ పవర్ ఫుల్ రోల్ ని ఎవరు పోషించాలో ఫైనల్ చేసేశారట.

తమిళ్ తో పాటు తెలుగులోనూ లవర్ బోయ్ గా క్రేజ్ సంపాదించుకున్న హీరో మాధవన్. సఖి సినిమాతో ఇతగాడు టాలీవుడ్ లోనూ బాగా పేరు సంపాదించుకున్నాడు. ఇప్పుడు తని ఒరువన్ తెలుగు రీమేక్ లో విలన్ కేరక్టర్ కి మాధవన్ ని ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది ఈ విషయాన్ని. బ్రూస్ లీ రిలీజ్ రోజున.. అటు చిరు కత్తి రీమేక్ సంగతులు, ఇటు చరణ్ తని ఒరువన్ రీమేక్ విషయాలను చెప్పబోతున్నారని టాక్.