Begin typing your search above and press return to search.

#ట్రెండీ గుస‌గుస‌: `గాడ్ ఫాదర్` విల‌న్ గా మాధవన్?

By:  Tupaki Desk   |   29 Aug 2021 1:34 PM GMT
#ట్రెండీ గుస‌గుస‌: `గాడ్ ఫాదర్` విల‌న్ గా మాధవన్?
X
ప్రముఖ నటుడు మాధవన్ త‌మిళం హిందీలో స్టార్ గా వెలిగిపోతున్నారు. త‌న‌కు కుదిరిన‌ప్పుడు తెలుగు సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందు నాగ‌చైత‌న్య స‌వ్యసాచి సినిమాలో విల‌న్ గా న‌టించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి విలన్ గా మారబోతున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ లో మాధవన్ విలన్ గా నటిస్తారని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

చాలా కాలం క్రితం మలయాళీ నటుడు బిజు మీనన్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తారని ఒరిజిన‌ల్ లో వివేక్ ఒబేరాయ్ పోషించిన పాత్ర ఇద‌ని ప్ర‌చార‌మైంది. అయితే తాజా అప్ డేట్ ప్ర‌కారం.. మాధవన్ ని ఆ పాత్ర కోసం ఎంపిక చేసినట్లు తెలిసింది. మేకర్స్ నుండి దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

`గాడ్ ఫాదర్` మలయాళ బ్లాక్ బస్టర్ `లూసిఫర్`కి తెలుగు రీమేక్. చిరంజీవి కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లో సినిమా షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రంలో నయనతార- సత్య దేవ్ - అనసూయ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

మహేష్ .. బ‌న్నిల‌కు ఆ ఛాన్స్ మిస్

సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న స‌ర్కార్ వారి పాటలో విల‌న్ గా అర‌వింద స్వామి- ఉపేంద్ర .. బాలీవుడ్ స్టార్ హీరో అనీల్ క‌పూర్ పేర్లు వినిపించాయి. అప్ప‌ట్లోనే వీళ్లంద‌రినీ కాద‌ని ఆర్.మాధ‌వ‌న్ ని లాక్ చేశార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. కానీ దానిపై క్లారిటీ లేదు. ఆ త‌ర్వాతా స్టైలిష్ స్టార్ అల్లు అర్జ‌న్ పుష్ప కోసం కూడా మ్యాడీనే సంప్ర‌దించార‌ని మ‌రో క‌థ‌నం వేడెక్కించింది. సేతుప‌తి కాల్షీట్లు వృధా అవ్వ‌డంతో పోలీసాఫీస‌ర్ పాత్ర కోసం మాధ‌వ‌న్ ని బ‌రిలో దించే ఆలోచ‌న చేస్తున్నార‌ని ప్ర‌చారం సాగింది. కానీ చివ‌రికి మ్యాడీ కాల్షీట్లు దొర‌క్క‌పోవ‌డంతో మ‌ల‌యాళ స్టార్ ఫ‌హ‌ద్ ఫాజిల్ ని సుకుమార్ లాక్ చేశారు. మాధ‌వ‌న్ న‌టించిన నిశ్శ‌బ్ధం ఇటీవ‌లే రిలీజై ఫ్లాపైన సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా అనుష్క న‌టించింది.