Begin typing your search above and press return to search.

మళ్లీ ఇన్నాళ్లకు 'అమృత' జంట

By:  Tupaki Desk   |   17 Jun 2019 11:08 AM IST
మళ్లీ ఇన్నాళ్లకు అమృత జంట
X
మణిరత్నం దర్శకత్వంలో 17 ఏళ్ల క్రితం వచ్చిన 'అమృత' చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో కూడా డబ్‌ అయిన ఆ చిత్రం కమర్షియల్‌ గా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయినా కూడా ఆ సినిమా కథ మరియు అమృత పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో బలమైన ముద్ర వేయడం జరిగింది. ఆ చిత్రంలో ఒక పాపకు తల్లిదండ్రులుగా మాధవన్‌ మరియు సిమ్రాన్‌ లు నటించారు. ఆ సినిమాలో వారి నటన మరియు వారిద్దరి మద్య రొమాన్స్‌ చాలా బాగా దర్శకుడు చూపించాడు.

ఆ చిత్రంకు ముందు పరవశం అనే చిత్రంలో కూడా మాధవన్‌ మరియు సిమ్రాన్‌ లు కలిసి నటించారు. అమృత చిత్రం తర్వాత వీరిద్దరు మళ్లీ కలిసి నటించలేదు. 17 ఏళ్ల తర్వాత వీరిద్దరి జంట మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నంబి నారాయణన్‌ బయోపిక్‌ గా రూపొందుతున్న 'రాకేట్రీ : ది నంబి ఎఫెక్ట్‌' లో మాధవన్‌ టైటిల్‌ రోల్‌ ను పోషిస్తున్నాడు. ఈ చిత్రానికి దర్శకత్వం కూడా మాధవన్‌ చేయడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. యంగ్‌ నంబి నారాయణన్‌ కు జోడీగా సిమ్రాన్‌ కనిపించబోతుంది.

ప్రస్తుతం వీరిద్దరి కాంబో సీన్స్‌ చిత్రీకరణ జరుగుతున్నాయి. అతి త్వరలోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేయబోతున్నారు. మాధవన్‌ ఈ చిత్రంలో రెండు విభిన్నమైన లుక్‌ లో కనిపించబోతున్నాడు. మొదటి గెటప్‌ లో పూర్తి గడ్డంతో ఒక శాస్త్రవేత్త లుక్‌ లో కనిపించబోతున్నాడు.. ఇక రెండవ గెటప్‌ లో గడ్డం మీసాలు లేకుండా క్లీన్‌ షేవ్‌ తో కనిపించబోతున్నాడు. సిమ్రాన్‌ కనిపించేది కొద్ది సమయమే అయినా మాధవన్‌ తో ఈమె కాంబో సీన్స్‌ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.