Begin typing your search above and press return to search.

సీనియర్‌ హీరోతో సమంత వీడియో వైరల్‌

By:  Tupaki Desk   |   17 Jan 2020 6:12 AM GMT
సీనియర్‌ హీరోతో సమంత వీడియో వైరల్‌
X
అయిదు పదుల వయసు ఉన్న హీరోలతో మూడు పదుల వయసు ఉన్న హీరోయిన్స్‌ రొమాన్స్‌ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వెండి తెరపైనే కాకుండా బుల్లి తెరపై కూడా చాలా వయసు తేడాతో నటిస్తున్నారు. కోలీవుడ్‌ స్టార్‌ హీరో మాధవన్‌ అయిదు పదుల వయసులో ఉన్నాడు. ఆయనతో మొదటి సారి స్టార్‌ హీరోయిన్‌ సమంత జత కట్టింది. అయితే వీరిద్దరు జత కట్టింది ఒక సినిమాకో లేదంటే ఏదైనా వెబ్‌ సిరీస్‌ కో కాదు. వీరిద్దరు కూడా జత కట్టింది ఒక కమర్షియల్‌ కోసం.

వీరిద్దరు కలిసి ఏవీటీ కంపెనీకి సంబంధించిన టీ పౌడర్‌ కోసం యాడ్‌ లో నటించారు. వీరిద్దరి కలయికలో షూట్‌ చేసిన ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఇరువై ఏళ్లు వయసు గ్యాప్‌ ఉన్నా కూడా వీరిద్దరి మద్య కెమిస్ట్రీ చాలా బాగుంది అంటూ నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరిద్దరి కలయికలో సినిమా వస్తే చూడాలనుంది అంటూ అభిమానులు అంటున్నారు.

తెలుగులో మాధవన్‌ కు మంచి క్రేజ్‌ ఉంది. ఈయన నటించిన పలు తమిళ చిత్రాలు తెలుగులో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. సవ్యసాచి చిత్రంతో మాధవన్‌ తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చాడు. సమంత ప్రస్తుతం టాలీవుడ్‌ లో టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా ఉంది. వీరిద్దరు కలిసి చేసిన ఈ టీ పౌడర్‌ యాడ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. మాధవన్‌ త్వరలో అనుష్కతో కలిసి నిశబ్దం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే.