Begin typing your search above and press return to search.

డబ్బు కోసమే అనేసిన ఛార్మింగ్ హీరో

By:  Tupaki Desk   |   29 Jan 2016 11:00 AM IST
డబ్బు కోసమే అనేసిన ఛార్మింగ్ హీరో
X
ఒకప్పుడు డబ్బు కోసమే తాను టీవీ షోలు చేశానని.. ఇప్పుడు కూడా అలాంటి షోలు చేస్తే డబ్బు కోసమే చేస్తానని అంటున్నాడు ఛార్మింగ్ హీరో మాధవన్. దశాబ్దంన్నరగా తమిళ - తెలుగు - హిందీ భాషల్లో ప్రేక్షకుల్ని అలరిస్తున్న మాధవన్.. ముందు వెలుగులోకి వచ్చింది టీవీ షోల ద్వారానే. 90ల్లో 'సీ హాక్స్' - 'బనేగీ అప్నీ బాత్' లాంటి షోలతో మాధవన్ అందరినీ ఆకట్టుకున్నాడు. ఆ షోల్లో మాధవన్ టాలెంటు చూసే మణిరత్నం ‘సఖి’ మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. ఐతే సినిమాల్లో పేరు తెచ్చుకున్నాక కూడా మాధవన్ 'తోల్ మోల్ కే బోల్' 'డీల్ యా నో డీల్' లాంటి రియాల్టీ షోలకు కూడా హోస్ట్‌ గా వ్యవహరించాడు మాధవన్.

ఐతే తాను కెరీర్ ఆరంభంలో డబ్బుల కోసమే టీవీ షోలు చేశానని.. అంతకుమించి ఆ కార్యక్రమాలపై తనకు ఆసక్తి లేదని మాధవన్ చెప్పాడు. నటుడయ్యాక కూడా తాను డబ్బుల కోసమే షోలు చేశానన్నాడు. టీవీ షోలను తాను వాణిజ్య ప్రకటనల్లా చూస్తానని.. రెండింట్లోనూ డబ్బు కోసమే చేస్తామని మాధవన్ అన్నాడు. ఐతే సినిమాలు చేసేటప్పుడు మాత్రం డబ్బు గురించి ఆలోచించనని.. తనకు సినిమాల విషయంలో ఎంతో ప్యాషన్ ఉందని మ్యాడీ చెప్పాడు. ఆ మాటకొస్తే సల్మాన్ ఖాన్ లాంటి వాళ్లు ‘బిగ్ బాస్’ తరహా షోలు చేసేది కూడా భారీ పారితోషకాలకు ఆశపడే. ఐతే మాధవన్ దాని గురించి ఓపెన్ గా మాట్లాడేశాడంతే. మాధవన్ ప్రధాన పాత్రలో నటించిన ‘సాలా ఖదూస్’ ఈ రోజే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ప్రిమియర్ షోల నుంచి ఈ చిత్రానికి సూపర్ హిట్ టాక్ వస్తోంది.