Begin typing your search above and press return to search.

కిళికి బాషకు చాలా బ్యాగ్రౌండ్‌ ఉంది

By:  Tupaki Desk   |   16 July 2015 3:24 PM GMT
కిళికి బాషకు చాలా బ్యాగ్రౌండ్‌ ఉంది
X
బాహుబలి చిత్రంలో 'కిళికి' అనే ఓ ప్రత్యేకమైన భాషను ప్రయోగించారు. కాళికేయ అండ్‌ గ్యాంగ్‌ మాట్లాడే భాష ఇది. అయితే ఈ భాష ఎలా పుట్టింది? రాజమౌళి ఎక్కడి నుంచి అడాప్ట్‌ చేసుకున్నాడు అన్న పాయింట్‌ జనాల్లో విస్త్రతంగా చర్చకొచ్చింది. అయితే అది ఎక్కడి నుంచి పుట్టిందో, దానికి ఇన్‌స్పిరేషన్‌ ఏంటో తెలుసుకునే ముందు ఇది చదవాల్సిందే.

పాపులర్‌ టివి సిరీస్‌ 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'లో ఓ ప్రత్యేకమైన భాష ఉంటుంది. ఆ భాష పేరు దోత్రకి. జార్జ్‌ ఆర్‌.ఆర్‌. మార్టిన్‌ రూపకల్పన చేసిన 'ఎ సాంగ్‌ ఆఫ్‌ ఐస్‌ అండ్‌ ఫైర్‌' నుంచి అడాప్ట్‌ చేసుకున్న లాంగ్వేజ్‌ ఇది. దర్శకుడు జేమ్స్‌ పీటర్‌సన్‌ ఆ పాట నుంచి ఇన్‌స్పయిర్‌ అయ్యి రాసుకున్న భాష. అలాగే లార్డ్స్‌ ఆఫ్‌ ది రింగ్స్‌ కోసం ఓ ప్రత్యేకమైన కాన్‌ (గిరిజన)భాషను ఉపయోగించారు. దీనికి ఇన్‌స్పిరేషన్‌ క్లింగన్‌ లాంగ్వేజ్‌. స్టార్‌ ట్రెక్‌ అభిమానులకు ఇది బాగా సుపరిచితమైన భాష. బిగ్‌ బ్యాంగ్‌ థియరీ పేరుతో ఓ ప్రఖ్యాత టెలీ కార్యక్రమం ప్రసారమైంది. దీనిలో ఉపయోగించిన భాష క్లింగన్‌. దీన్నుంచే జె.ఆర్‌.ఆర్‌.టొల్కిన్స్‌, ఇవ్లిష్‌ ఇన్‌స్పయిర్‌ అయ్యారు.

ఇక బాహుబలి విషయానికి వస్తే 'కిళికి' భాష సృష్టి వెనుక ఓ కుర్రాడున్నాడు. అతడి పేరు మదన్‌ కర్కి. 700పదాల్ని, 40గ్రామర్‌ రూల్స్‌ని కనిపెట్టి ఈ భాషను అతడు రూపొందించాడు. ఓ కొత్త భాష సృష్టి అంటే ఎంతో ఛాలెంజింగ్‌. అందునా యుద్ధభూమిలో మాట్లాడే భాష కాబట్టి దానికి ఎమోషన్‌ని జత చేయాల్సిందిగా రాజమౌళి చెప్పారు. అరదుకే ఆ భాషకు అనువాడకుడిని కూడా తెరపై చూపించారు.

''నేను ఆస్ట్రేలియాలో పిహెచ్‌డి చేస్తున్నప్పుడు 'క్లిక్‌' అనే కొత్త భాషని కనిపెట్టా. దాన్ని రాజమౌళికి చెప్పాను. అది బావుందని చెప్పి కిళికిని క్రియేట్‌ చేయమన్నారు. ఇక్‌, ట .. అనే రెండు వింత శబ్ధాలతో కొత్త భాష వినిపించాలి. దాని ప్రకారమే వొకాబులరీ, గ్రామర్‌ని క్రియేట్‌ చేశాను. అది బాగా వర్కవుటైంది. ఇప్పుడు అందరూ ఈ భాషను ఇమ్మిటేట్‌ చేయడం సంతోషాన్నిస్తోంది'' అని చెప్పుకొచ్చాడు. కిళికి బాషతో ఓ యాప్‌ని కూడా డిజైన్‌ చేస్తున్నాం, అది బాహుబలి-2 రిలీజ్‌నాటికి బైటికి వస్తుందేమో అని మదన్‌ చెబుతున్నారు.