Begin typing your search above and press return to search.

ప్రభాస్ సినిమాలో సూర్పనఖ పాత్రకైనా రెడీ అంటున్న మంచు భామ..!!

By:  Tupaki Desk   |   20 Aug 2020 3:00 PM GMT
ప్రభాస్ సినిమాలో సూర్పనఖ పాత్రకైనా రెడీ అంటున్న మంచు భామ..!!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస బిగ్ సినిమాలు ప్రకటిస్తూ దేశమంతా మాట్లాడుకునేలా చేస్తున్నాడు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయినప్పటి నుండి ప్రభాస్ సినిమాలు భారీ రేంజిలో ఉంటున్నాయి. ఆయనతో సినిమా తీయాలనే మేకర్స్ కూడా అదేవిధంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ఓకే చేసిన సినిమాలన్నీటి బడ్జెట్ 250 నుండి 400 కోట్లకు పై మాటే కావడం విశేషం. ఇక ప్రభాస్ ఇటీవల ప్రకటించిన ఆదిపురుష్ సినిమా టాపిక్.. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ గా మారింది. దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించనున్న ఈ మూవీ రామాయణం నేపథ్యంలో సాగనుంది. అయితే ఇందులో ప్రభాస్ రాముడు పాత్ర చేయనున్నారట. కెరీర్లో మొదటిసారిగా ప్రభాస్ ఓ మైథలాజికల్ మూవీ చేస్తుండటంతో.. రాముడి పాత్రలో ప్రభాస్ ఎలా ఉంటారో అనే ఆనందంలో ఫ్యాన్స్ అంచనాలు వేస్తున్నారు.

ఇక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత భూషణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఆదిపురుష్ సెట్స్ పైకి వెళ్లనుందట. ఈ సినిమాలో నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు ఇంకా తెలియలేదు. కానీ నెటిజన్లు మాత్రం ఊహాగానాలు సృష్టిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఆదిపురుష్ మూవీలో సూర్పణఖ పాత్ర చేస్తానంటుందట.. మంచు లక్ష్మీ. ఈ మూవీ అనౌన్స్ చేసే టైంలో ఓ నెటిజెన్ ఆదిపురుష్ మూవీలో సూర్పనఖ పాత్రకు మంచు లక్ష్మీ బాగుంటారని ట్వీట్ చేయడం జరిగింది. ఆ ట్వీట్ కి స్పందించిన మంచు లక్ష్మీ "వావ్ నేను రెడీ, ఎక్కడ సైన్ చేయమంటారో చెప్పండని" తన ఉత్సాహాన్ని బయటపెట్టింది. మరి ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ నటిస్తున్న భారీ చిత్రంలో చిన్న పాత్ర దొరికినా ఎగిరి గంతేసి ఓకే చెప్తారు. ఇక రామాయణంలో సూర్పనఖ పాత్ర ఎంత కీలకమో అందరికి తెలిసిందే. ఇక ఆదిపురుష్ 3డి లో రూపొందనుందని సమాచారం.