Begin typing your search above and press return to search.

మాచ‌ర్ల.. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌!

By:  Tupaki Desk   |   13 Aug 2022 8:29 AM GMT
మాచ‌ర్ల.. ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌!
X
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నితిన్ న‌టించిన లేటెస్ట్ పొలిటిక‌ల్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ `మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం`. కృతిశెట్టి, కేధ‌రిన్ హీరోయిన్ లుగా న‌టించారు. శ్రేష్ట్ మూవీస్ బ్యాన‌ర్ పై ఎన్ . సుధాక‌ర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ద్వారా ఎడిట‌ర్ ఎం.ఎస్‌. రాజ‌శేఖ‌ర‌రెడ్డి ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. భారీ అంచ‌నాల మ‌ధ్య ఈ మూవీ ఆగ‌స్టు 12న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. పాట‌లు, ట్రైల‌ర్ ఆక‌ట్టుకుని సినిమాపై బ‌జ్ ని క్రియేట్ చేశాయి.

అయితే ఫ‌స్ట్ డే ఈ మూవీ కొంత డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినా స‌రే ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు రెస్ట్ ఆఫ్ ద ఇండియా వైడ్ గా మంచి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్ గా తొలి రోజు రూ. 10 కోట్ల గ్రాస్ ని రాబ‌ట్టింది.

నితిన్ కెరీర్ లోనే అత్యంత భారీ స్థాయిలో ప్రారంభ వ‌సూళ్ల‌ని రాబట్టిన సినిమాగా నిలిచింది. తొలి రోజు ఇండియా వైడ్ గా ఈ మూవీ రూ. 4.96 కోట్ల షేర్ ని రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇది నితిన్ కెరీర్ లో డే వ‌న్ ఇండియా వైడ్ గా సాధించిన బిగ్ అమౌంట్ గా చెబుతున్నారు.

ఈ వీకెండ్ లో ఈ ఫిగ‌ర్ మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం వుందట‌. వీకెండ్ కావ‌డం.. మండే ఇండిపెండెన్స్ డే కావ‌డంతో ఈ మూవీకి బాగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని మూవీ వ‌ర్గాలు అంటున్నాయి. ఇందులో హీరో నితిన్ క‌లెక్ట‌ర్ గా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌లో న‌టించిన విష‌యం తెలిసిందే.

అయితే క‌లెక్ట‌ర్ అంటే సాఫ్ట్ గా వైట్ కాల‌ర్ తో వుంటారు కానీ ఈ మూవీలో నితిన్ ప‌క్కా మాస్ అవ‌తార్ లో క‌నిపించి యాక్ష‌న్ లు ఫైట్ లు, ప్ర‌త్య‌ర్థుల‌పై పంచ్ డైలాగ్ లు విసిరిన విష‌యం తెలిసిందే.

ప్ర‌స్తుతం టాక్ ఎలా వున్నా ఫ‌స్ట్ వీక్ మాత్రం ఈ మూవీ మంచి నంబ‌ర్స్ ని రాబ‌డుతుంద‌ని చిత్ర వ‌ర్గాలు అంటున్నాయి. ఇక భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఫ‌స్ట్ డే వ‌ర‌ల్డ్ వైడ్ గా రాబ‌ట్టిన క‌లెక్ష‌న్స్ వివ‌రాలు ఇలా వున్నాయి.

నైజాం: 1.43 కోట్లు

వైజాగ్ : 69 ల‌క్ష‌లు

క్రిష్ణా : 30 ల‌క్ష‌లు

ఈస్ట్ : 46 ల‌క్ష‌లు

వెస్ట్ : 22 ల‌క్ష‌లు

గుంటూర్ : 55 ల‌క్ష‌లు

నెల్లూర్ : 26 ల‌క్ష‌లు

సీడెడ్ : 76 ల‌క్ష‌లు

క‌ర్ణాట‌క : 18 ల‌క్ష‌లు

రెస్ట్ ఆఫ్ ఇండియా : 9.7 ల‌క్ష‌లు

టోట‌ల్ షేర్ ( ఇండియా వైడ్‌) : 4,96,72,973

టోట‌ల్ గ్రాస్ వ‌ర‌ల్డ్ వైడ్ : 10 కోర్స్ ప్ల‌స్‌.