Begin typing your search above and press return to search.

'అదిరిందే' అన్నారు.. పోస్టర్ ఏంటి ఇలా ఉంది..?

By:  Tupaki Desk   |   21 July 2022 3:29 PM GMT
అదిరిందే అన్నారు.. పోస్టర్ ఏంటి ఇలా ఉంది..?
X
యూత్ స్టార్ నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''మాచర్ల నియోజకవర్గం''. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతోంది. ఇందులో కృతి శెట్టి మరియు క్యాథరీన్ త్రెసా హీరోయిన్లుగా నటించారు. అంజలి స్పెషల్ సాంగ్ లో మెరిసింది. రిలీజ్ కు రెడీ అయిన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

'మాచర్ల నియోజకవర్గం' నుంచి వచ్చిన 'రారా రెడ్డి' పాట యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ తో సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ క్రమంలో మహతి స్వర సాగర్ స్వరాలు సమకూర్చిన 'అదిరిందే' అనే మరో సాంగ్ ని రిలీజ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

నితిన్ - కృతి శెట్టి లపై చిత్రీకరించిన ఈ లవ్లీ కూల్ మెలోడీని జులై 23న విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు చిత్ర బృందం గురువారం సాయంత్రం అనౌన్స్ మెంట్ పోస్టర్ ని వదిలారు. నితిన్ మరియు కృతి ఉన్న ఈ పోస్టర్ కు మిశ్రమ స్పందన లభించింది.

మెలోడీ సాంగ్ కు తగ్గట్టుగా లేదని.. మరీ ఆడ్ గా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హీరోయిన్ డ్రెస్సింగ్ కూడా ఆకర్షణీయంగా లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టర్ చూసి బాగాలేదని అంటున్నారు. మరి సాంగ్ వచ్చిన తర్వాత ఒపీనియన్స్ మార్చుకొని అదిరిందే అంటారేమో చూడాలి.

'మాచర్ల నియోజకవర్గం' చిత్రాన్ని ఆగస్ట్ 12వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల చేయనున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో రెగ్యులర్ అప్డేట్స్ తో ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడానికి టీమ్ ప్లాన్స్ చేసింది. జూలై 26న 'మాచర్ల ధమ్కి'... జూలై 29న 'మాచర్ల నియోజకవర్గం' థియేట్రికల్ ట్రైలర్ ను లాంచ్ చేస్తునట్లు నిర్మాతలు ప్రకటించారు.

నితిన్ ఈ సినిమాలో సిద్ధార్థ్ రెడ్డి అనే ఐఏఎస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. విలక్షణ నటుడు సముద్రఖని విలన్ గా నటించారు. రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నితిన్ తండ్రి ఎన్.సుధాకర్ రెడ్డి మరియు సోదరి నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.

మాచర్ల నియోజకవర్గం సినిమాకి ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందించగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ రాసారు. వెంకట్ - రవివర్మ - అనల్ అరసు ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాలో యాక్షన్ డిజైన్ చేసారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.