Begin typing your search above and press return to search.

'మాచర్ల నియోజకవర్గం' టాకీ పార్ట్ పూర్తి.. కలెక్టర్ సాబ్ కౌంట్ డౌన్ స్టార్ట్..!

By:  Tupaki Desk   |   24 Jun 2022 11:30 AM GMT
మాచర్ల నియోజకవర్గం టాకీ పార్ట్ పూర్తి.. కలెక్టర్ సాబ్ కౌంట్ డౌన్ స్టార్ట్..!
X
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ''మాచర్ల నియోజకవర్గం''. ఎమ్.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తుండగా.. కేథరిన్ త్రెసా మరో కథానాయికగా కనిపించనుంది.

ఒక పాట మినహా 'మాచర్ల నియోజకవర్గం' షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. మిగిలిన చివరి సాంగ్ ను త్వరలో చిత్రీకరించనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇప్పటికే సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ కంప్లీట్ అయింది.

ఈ నేపథ్యంలో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్‌లను ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్‌లతో వస్తున్నారు. తాజాగా 'మాచర్ల నియోజకవర్గం' నుంచి నితిన్ - కృతి శెట్టిల అందమైన పోస్టర్ ను వదిలారు. ఇందులో ఇద్దరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఇది యూరప్ లో చిత్రీకరించబడిన పాట అని తెలుస్తోంది. పోస్టర్‌ లో నితిన్ ఉబర్ కూల్‌ గా కనిపిస్తుండగా.. కృతి అందంగా ఉంది.

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై ఎన్.సుధాకర్ రెడ్డి - నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇది రాజకీయ అంశాలతో కూడిన పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌. అత్యంత భారీ బడ్జెట్‌ తో అత్యున్నత సాంకేతిక అంశాలతో ఈ సినిమా రూపొందుతోంది.

'మాచర్ల నియోజకవర్గం' సినిమాలో నితిన్ ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రసాద్ మూరెళ్ల ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. మామిడాల తిరుపతి డైలాగ్స్ రాస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రాఫర్. మామిడాల తిరుపతి డైలాగ్స్ అందించగా, సాహి సురేష్ ఆర్ట్ డైరెక్టర్. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌. వెంకట్ - రవివర్మ మరియు అనల్ అరసు వంటి ముగ్గురు ఫైట్ మాస్టర్స్ ఈ సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ చేసారు.

'మాచర్ల నియోజకవర్గం' సినిమా 2022 ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. విడుదలకు ఇంకా 50 రోజులు ఉన్న నేపథ్యంలో నితిన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కౌంట్ డౌన్ స్టార్ట్ చేస్తూ ట్వీట్లు పెడుతున్నారు.