Begin typing your search above and press return to search.

క‌ట్ట‌ప్ప త‌న‌యుడి సినిమా సాంగ్ అదిరింది

By:  Tupaki Desk   |   15 Dec 2021 4:32 PM GMT
క‌ట్ట‌ప్ప త‌న‌యుడి సినిమా సాంగ్ అదిరింది
X

క‌ట్ట‌ప్ప‌గా వ‌ర‌ల్డ్ వైడ్‌గా అభిమానుల్ని సొంతం చేసుకున్నారు స‌త్య‌రాజ్. ఆయ‌న త‌న‌యుడు శిబిరాజ్ కూడా త‌మిళంలో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నారు. ఆయ‌న న‌టిస్తున్న తాజా త‌మిళ చిత్రం `మాయోన్‌`. తాన్య ర‌విచంద్ర‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ఎన్ . కిషోర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. మైథ‌లాజిక‌ల్ మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఇదే పేరుతో తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు.

ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం అందించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ట్రాక్ ని విడుద‌ల చేశారు. ఈ పాట.. ఈ పాట‌కు ఇళయ‌రాజా అందించిన సంగీతం ఇప్ప‌టికే టాక్ ఆఫ్ ది కోలీవుడ్ గా మారింది. అదే పాట‌ని తెలుగులోనూ `మాంపాహి..` గా మేక‌ర్స్ తాజాగా రిలీజ్ చేశారు. తెలుగులోనూ అదే రెస్పాన్స్‌ని ద‌క్కించుకోవ‌డంతో టైటిల్ సాంగ్ అదిరిపోయింద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. లేటు వ‌య‌సులోనూ అదే కూడా మాస్ట్రో అద్భుత‌మైన ట్యూన్స్‌ని ఇస్తుండ‌టం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి లోను చేస్తోంది.

ఇటీవ‌ల త‌మిళ‌లో విడుద‌లైన ఈ పాట ఇప్ప‌టికే వ‌న్ మిలియ‌న్ వ్యూస్ ని దాటి స్ట్రాంగ్ గా వెళుతోంది. మైథ‌లాజిక‌ల్ ఫాంట‌సీ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న `మాయోన్` టీజ‌ర్ ని ఇటీవ‌లే విడుద‌ల చేశారు. స‌రికొత్త నేప‌థ్యంలో ఫాంట‌సీ అంశాల‌తో సాగే ఈ థ్రిల్ల‌ర్ విశేషంగా ఆక‌ట్టుకుంది. అరుణ్ మోళి మానిక్క‌మ్ డ‌బుల్ మీనింగ్ ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక కాలంలో విడుద‌ల కానున్న ఈ చిత్రానికి `అఖండ‌` సినిమాటోగ్రాఫ‌ర్ సి. రామ్ ప్ర‌సాద్ వ‌ర్క్ చేస్తున్నారు.