Begin typing your search above and press return to search.

అమ్మాయి మాయలో బెల్లంకొండ బ్రదర్.. లవ్లీ సాంగ్

By:  Tupaki Desk   |   12 Dec 2022 11:14 AM GMT
అమ్మాయి మాయలో బెల్లంకొండ బ్రదర్.. లవ్లీ సాంగ్
X
బెల్లంకొండ సురేష్ చిన్న కుమారుడు బెల్లంకొండ గణేష్ కూడా హీరోగా తన ప్రయాణాన్ని ఇటీవల మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అతని మొదటి సినిమా స్వాతిముత్యం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక ఇప్పుడు రెండవ సినిమాతో కూడా అతను మంచి సక్సెస్ అందుకోవాలి అని రెడీ అవుతున్నాడు. నాంది వంటి సినిమాలను నిర్మించిన సతీష్ వర్మ నిర్మాతగా రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నేను స్టూడెంట్ సార్ అనే సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈరోజు ఒక స్పెషల్ సాంగ్ విడుదల చేశారు అమ్మాయి ప్రేమలో మునిగి తేలుతున్న హీరో ఆ అమ్మాయి చేసిన మాయ గురించి వివరించేలా ఉన్న ఈ పాట ఎంతో అద్భుతంగా ఉంది మాయ మాయే.. అనే ఈ సాంగ్ ను మాస్ కమర్షియల్ దర్శకుడు గోపిచంద్ మలినేని చేతుల మీదుగా విడుదల చేశారు. ఇక పాట చాలా బాగుందని కూడా కూడా ఆయన విషెస్ అందించారు.

ఇక సాంగ్ విడుదలైన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఈ లిరికల్ సాంగ్ లో బెల్లంకొండ గణేష్ కూడా చాలా హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపిస్తున్నాడు. కృష్ణ చైతన్య రాసిన లిరిక్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక మణిశర్మ కుమారుడు మహతీ స్వర సాగర్ మరోసారి తను మ్యూజిక్ తో అదరగొట్టేసాడు.

ఈ సాంగ్ అతడు అందించిన ట్యూన్స్ కూడా చాలా కొత్తగా ఫ్రెష్ గా ఉన్నాయి. దానికి తోడు కపిల్ కపిలన్ ఈ పాటను పాడిన విధానం కూడా బాగుంది. అతనితోపాటు మహతి సాగర్ కూడా ఈ పాటలో తన గాత్రాన్ని జత చేశాడు. మొత్తానికి మాయ మాయ లిరికల్ సాంగ్ మాత్రం 'నేను స్టూడెంట్స్ సార్' సినిమాపై మరింత అంచనాలను పెంచేది.

అలాగే ఈ పాటను రచించిన కృష్ణ చైతన్య ఈ సినిమాకు కథను అందించడం కూడా విశేషం. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా అవంతిక నటిస్తోంది. హీరోతో ఆ అమ్మాయి కెమిస్ట్రీ చాలా అందంగా ప్రజెంట్ అయినట్లు పోస్టర్స్ చూస్తేనే అర్థమవుతుంది.

ఇక నేను స్టూడెంట్ సార్ అనే సినిమాను త్వరలోనే గ్రాండ్ గా థియేటర్స్ లోనే విడుదల చేయబోతున్నారు. ఈ సినిమాలో సముద్రఖని, సునీల్, శ్రీకాంత్ అయ్యంగర్, ఆటో రాంప్రసాద్ వంటి ప్రముఖ నటులు కూడా ముఖ్యమైన పాత్రలలో కనిపించబోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.