Begin typing your search above and press return to search.

టీజర్ టాక్: మాస్క్ లో ఉంది ఎవరబ్బా?

By:  Tupaki Desk   |   3 Aug 2016 4:46 AM GMT
టీజర్ టాక్: మాస్క్ లో ఉంది ఎవరబ్బా?
X
రన్.. ఒక అమ్మాయి తప్ప.. అంటూ ఈ ఏడాది ఇప్పటికే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందీప్ కిషన్.. ఇప్పుడు హీరోతో అందాల రాక్షసితో కలిసి మాయావన్ అనే మూవీ చేస్తున్నాడు. ఇది తమిళ్ మూవీ కాగా.. ఇంకా ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబంధించిన డీటైల్స్ అనౌన్స్ చేయలేదు. గతంలో పిజ్జా వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన సీవీ కుమార్.. తొలిసారిగా దర్శకత్వం వహిస్తూ మాయావన్ చేస్తున్నాడు.

ప్రతీ నేరానికి ఓ కారణం ఉంటుంది అంటూ సీరియల్ కిల్లర్ ని వెతుకుంటాడు సందీప్ కి.. ప్రతీదీ మన వర్క్ లో భాగమే అంటూ సేమ్ విలన్ ని ట్రేస్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. ఇంతకీ ఆ విలన్ మాస్క్ లో తప్ప కనిపించడు. మాస్క్ మ్యాన్ ని వెతుక్కుంటూ ఛేజింగ్ లు చేయాల్సి వస్తుంది. ఈ ట్రైలర్ మహా ప్రామిసింగ్ గా ఉందని చెప్పాలి. మాయావన్ లో సందీప్ కిషన్ తో పాటు లావణ్య త్రిపాఠి కూడా పోలీసులుగా నటిస్తుండడం విశేషం.

ముఖ్యంగా మాయావన్ ట్రైలర్ కి మ్యూజిక్ బాగా ప్లస్ అయింది. ఆర్మీ మ్యాన్ గా జాకీష్రాఫ్ కూడా కనిపిస్తుండగా.. టీజర్ చూస్తుంటే మాత్రం సందీప్ కిషనే విలన్ అనిపించే విధంగా కట్ చేశారు. మొత్తానికి మాయావన్ లో మాత్రం అంచనా వేయలేని సీక్రెట్ ఏదో ఉందని అనిపించక మానదు.