Begin typing your search above and press return to search.

మాటే వినదుగా.. మరో గీత లా జవాల్కర్

By:  Tupaki Desk   |   31 Oct 2018 7:02 AM GMT
మాటే వినదుగా.. మరో గీత లా జవాల్కర్
X
విజయ్ దేవరకొండ. పేరు చెప్పగానే విషయం ఏంటా అని ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఎందుకంటే ఆ క్రేజ్ అలా ఉంది. 'నోటా' ఫ్లాప్ అయిందని విజయ్ కి క్రేజ్ తగ్గిందని.. తగ్గుతుందని అని అనుకున్నవారికి 'సవ్యసాచి' ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో విజయ్ కి వచ్చిన రెస్పాన్స్ కాస్త షాక్ ఇచ్చింది. ఒకటి రెండు ఫ్లాపులు పడితే తగ్గే క్రేజ్ విజయ్ ది కాదని అది ప్రూవ్ చేసింది.

ఇక విజయ్ తాజా చిత్రం 'టాక్సీవాలా' నవంబర్ 16 న రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇప్పటికే చాలా డిలే అయిందని సినిమాపై బజ్ తక్కువగా ఉందని అంటున్నారు గానీ సినిమా రిలీజ్ రోజుకు గానీ ఆ విషయంపై మనం ఒక అంచనాకు రాలేం. ఇక 'టాక్సీవాలా' ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. రీసెంట్ గా ఈ సినిమానుండి 'మాటే వినదుగా' అంటూ సాగే లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు.ఈ పాట ను రిలీజ్ చేసిన నాలుగు రోజుల్లోనే ఆదిత్య మ్యూజిక్ వారి యూట్యూబ్ ఛానల్ లో 2.2 మిలియన్ వ్యూస్ నమోదు చేయడం విశేషం. సిడ్ శ్రీరాం గానం.. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బెజోయ్ పెపీ ట్యూన్.. వీటికి తోడు విజయ్ - ప్రియాంక జవాల్కర్ కెమిస్ట్రీ నెటిజనులను ఫుల్ గా ఆకట్టుకుంటున్నాయి. ఇక కృష్ణ కాంత్ అందించిన లిరిక్స్ కూడా క్యాచీ గా ఉండడంతో మ్యూజిక్ లవర్స్ ఫిదా అవుతున్నారు.

తాజాగా ఈ 'మాటే వినదుగా' వీడియోసాంగ్ ను కూడా రిలీజ్ చేశారు. 'గీత గోవిందం' లో 'ఇంకేం ఇంకేం' పాటలో విజయ్ - రష్మిక ల మధ్యనున్న కెమిస్ట్రీ లాగానే ఈ పాటలో విజయ్ - ప్రియాంక ల మధ్య కెమిస్ట్రీ ఉందని కొంతమంది అంటున్నారు. రష్మిక లాగానే ప్రియాంక కూడా తన ఛార్మింగ్ ప్రెజెన్స్ తో పాటుగా క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో నెటిజనులను ఆకట్టుకుంటోంది. మీరు ఈ వీడియో సాంగ్ పై ఒక లుక్కేయండి.