Begin typing your search above and press return to search.

మాస్ కా దాస్ యాక్ష‌న్ కింగ్ కి షాకిచ్చాడా?

By:  Tupaki Desk   |   5 Nov 2022 9:30 AM GMT
మాస్ కా దాస్ యాక్ష‌న్ కింగ్ కి షాకిచ్చాడా?
X
యంగ్ హీరో మాస్ కా విశ్వ‌క్ సేన్ రీసెంట్ గా న‌టించిన రొమాంటిక్ ఎమోష‌న‌ల్ డ్రామా 'ఓరి దేవుడా'. త‌మిళంలో విజ‌య‌వంత‌మైన 'ఓమై క‌డ‌వులే' ఆధారంగా ఈ మూవీని రీమేక్ చేశారు. పీవీపీ సినిమా, శ్రీ‌వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీ ఇటీవ‌ల దీపావ‌ళి సంద‌ర్భంగా విడుద‌లై మంచి టాక్ ని సొంతం చేసుకుంది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం విజ‌యాన్ని సొంతం చేసుకోలేక‌పోయింది.

దీంతో ఈ మూవీ యావ‌రేజ్ గ్రాసర్ గా నిలిచింది. మిథిలా పాల్క‌ర్, ఆశా భ‌ట్ హీరోయిన్ లుగా న‌టించ‌గా కీల‌కమైన అతిథి పాత్ర‌లో గాడ్ గా విక్ట‌రీ వెంక‌టేస్ న‌టించారు. క్రేజీ కాంబినేష‌న్ లో తెర‌కెక్కిన సినిమాగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేసిన ఈ మూవీ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవ‌డంలో నూటికి నూరుపాళ్లు విజ‌యం సాధించ‌లేక‌పోయింది. ఇదిలా వుంటే ఈ మూవీ త‌రువాత హీరో విశ్వ‌క్ సేన్ 'గామి' మూవీతో పాటు స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో 'దాస్ కీ ధ‌మ్కీ'లో న‌టిస్తున్నాడు.

ప్ర‌స్తుతం ఈ మూవీస్ షూటింగ్ ద‌శ‌లో వున్నాయి. ఈ మూవీస్ తో పాటు మ‌రో రెండు సినిమాల్లో విశ్వ‌క్ సేన్ అతిథి పాత్ర‌ల్లో న‌టిస్తుండ‌గా యాక్ష‌న్ కింగ్ అర్జున్ తెర‌కెక్కిస్తున్న సినిమాని కూడా అంగీక‌రించాడు. సీనియ‌ర్ హీరో అర్జున్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిస్తున్న ఈ మూవీ ద్వారా ఆయ‌న కుమార్తె ఐశ్వ‌ర్యా అర్జున్ హీరోయిన్ గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతోంది. కొన్ని నెల‌ల క్రితం ప‌వర్ స్టార్ ప‌వన్ క‌ల్యాణ్ క్లాప్ తో ఈ మూవీ పూజా కార్య‌క్ర‌మాలు కూడా పూర్తి చేశారు.

రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెట్టాల‌నుకున్నారు. వ‌న్ డే షూట్ కూడా జ‌రిపిన ఈ ప్రాజెక్ట్ విశ్వ‌క్ సేన్ వ‌ల్ల‌ అర్థాంత‌రంగా ఆగిపోయిన‌ట్టుగా తెలుస్తోంది. కార‌ణం మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ ఈ మూవీ నుంచి త‌ప్పుకోవ‌డ‌మే న‌ని తెలుస్తోంది.

యాక్ష‌న్ కింగ్ అర్జున్ కి, హీరో విశ్వ‌క్ సేన్ కి మ‌ధ్య అభిప్రాయ బేధాలు వ‌చ్చాయ‌ని, ఆ కార‌ణంగానే ఈ ప్రాజెక్ట్ నుంచి విశ్వ‌క్ సేన్ త‌ప్పుకున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. త్వ‌ర‌లో షూటింగ్ మొద‌లు పెట్టాల‌ని భావిస్తున్న అర్జున్ ఈ విష‌య‌మై ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఫిర్యాదు చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌.

త్వ‌ర‌లోనే దీనిపై ప్ర‌క‌ట‌న రానున్న‌ట్టుగా తెలుస్తోంది. అర్జున్ ఫిల్మ్ ఛాంబ‌ర్ లో ఫిర్యాదు చేస్తే మాస్ కా దాస్ విశ్వ‌క్ సేన్ దీనిపై ఎలా స్పందింస్తాడు?.. ఎలాంటి వివ‌ర‌ణ ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌ది ఇప్ప‌డు ఆస‌క్తిక‌రంగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.