Begin typing your search above and press return to search.

​మున్నా భాయ్ భార్య బికినీ స్టార్

By:  Tupaki Desk   |   6 July 2017 7:33 AM GMT
​మున్నా భాయ్ భార్య బికినీ స్టార్
X
బికినీలు వేసుకొని బీచ్లో సరదాగా కాలక్షేపం చేయడం మన బాలీవుడ్ స్టార్స్ కు కొత్తేం కాదు. కాకపోతే ఇప్పుడు స్టార్స్ మాత్రమే కాదు హీరోల భార్యలు కూడా స్టార్ హీరోయిన్లు మాదిరిగా వాళ్ళ అందాలును సోషల్ మీడియా లో పోస్టులు పెట్టి పాపులర్ అవుతున్నారు. మున్నా భాయ్ హీరో సంజయ్ దత్త్ భార్య మాన్యత ఇప్పుడు మామూలుగా రచ్చ లేపట్లేదు అనుకోండి.

నిజానికి ఈవిడ దగ్గర ఉన్న బికినీ కలెక్షన్ తో ఒక బికినీ స్టోరే ఓపెన్ చేయవచ్చు అనే ఒక కామెంట్ కూడా వినబడుతోంది అంటే మాన్యతకు బీచ్లు బికినీలు ఎంతగా అలవాటు అయ్యాయో అర్ధం చేసుకోవచ్చు. ఈ మధ్యనే సంజయ్ దత్త్ బిజీ షూటింగ్ షెడ్యూల్ నుండి కొంత బ్రేక్ తీసుకొని భార్య పిల్లలు షాహ్రాన్ - ఇక్రాలతో కలిసి యూరోప్ టూర్ వెళ్ళాడు. ఆ ఫోటోలను చూస్తుంటే ఇక్కడ ఉన్న బికినీ స్టైల్ మరో సారి భార్య మాన్యతను బికినీ స్టార్ ని చేశాయి. ఇక్కడ పోస్ట్ చేసిన మనోహరమైన ఫోటో కు సోషల్ మీడియా పిచ్చ పిచ్చగా లైక్లు షేర్లు వస్తున్నాయంటే చూసుకోండి.

అతి పెద్ద షాక్ ఏంటంటే.. ఈ మాన్యత ఫోటోలపై సంజయ్ మొదటి భార్య కూతురు త్రిషాలా కూడా స్పందించింది. బ్యూటిఫుల్ పిక్చర్స్.. బాగా ఎంజాయ్ చేస్తున్నట్లు ఉన్నారు.. అంటూ కామెంట్ చేసింది. తన రెండో భార్యకు ఈ రేంజులో బికినీ స్వేచ్ఛను ఇస్తున్న మున్నాభాయ్.. కూతురు త్రిషాలా ను మాత్రం హీరోయిన్ కావొద్దని అంటున్నాడే. వాటీజ్ దిస్ బాబా!!