Begin typing your search above and press return to search.
వైరల్ అవుతున్న అధీరా హ్యాపీ ఫ్యామిలీ పిక్..!
By: Tupaki Desk | 2 March 2021 8:00 AM ISTబాలీవుడ్ స్టార్ యాక్టర్ సంజయ్ దత్ భార్య మాన్యత దత్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే సంగతి తెలిసిందే. ప్రస్తుతం మాన్యత తన పిల్లలు ఇక్రా, షహ్రాన్‌లతో కలిసి దుబాయ్‌లో ఉంది. ఎల్లప్పుడూ తన విషయాలను షేర్ చేసుకునే స్టార్ యాక్టర్ భార్య ఇంస్టాగ్రామ్ లో తాజా పోస్టులతో అభిమానులను అలరిస్తూనే ఉంటుంది. ఈరోజు మాన్యత ఇంస్టా వేదికగా తన భర్త సంజయ్, పిల్లలతో కలిసి దిగిన ఓ హ్యాపీ ఫ్యామిలీ పిక్ షేర్ చేసింది. సంజయ్ ఫ్యామిలీ ఫోటోలో వారంతా ఎంతో సంతోషంగా కనిపించడం మనం చూడవచ్చు. మాన్యత తన పిల్లలతో పాటు వైట్ టి-షర్ట్ ధరించగా.. సంజు బ్లాక్ టిషర్ట్ ధరించి ఫోటోకు పోజివ్వడం గమనించవచ్చు. ఇటీవలే సంజయ్, మాన్యత తమ మ్యారేజ్ అనివెర్సరీని జరుపుకున్నారు.
ఆ హ్యాపీ రోజును మరింత ప్రత్యేకం చేయడానికి మాన్యత సోషల్ మీడియాలో త్రోబ్యాక్ పిక్ షేర్ చేసింది. ఫోటోతో పాటు మాన్యత సంజయ్ పై ఆమె ప్రేమను కూడా నోట్ రూపంలో బయటపెట్టింది. 'మనం ఒకరిని ఒకరం చేయందుకొని.. ఒకరినొకరు వెలుగు చీకట్లను అంగీకరించి మరో కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్నాం. ఒకరి చేయి ఒకరం అందుకున్న రోజు. ఈ ప్రపంచంలో నా బలానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు' అంటూ మాన్యత చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం సంజయ్ దత్ భారీ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన మోస్ట్ అవెయిటింగ్ కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల గురించి ఎదురు చూస్తున్నాడు. అలాగే రణబీర్ కపూర్, వాణికపూర్ లతో 'షంషేర్' సినిమాలో నటిస్తున్నాడు.