Begin typing your search above and press return to search.

మామన్నన్ టాక్ ఏంటి..?

By:  Tupaki Desk   |   30 Jun 2023 10:18 PM IST
మామన్నన్ టాక్ ఏంటి..?
X
కోలీవుడ్ లో తన మార్క్ సినిమాలతో అలరిస్తున్న మారి సెల్వరాజ్ లేటెస్ట్ గా మామన్నన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఉదయనిధి స్టాలిన్, వడివేలు, కీర్తి సురేష్ ప్రధాన పాత్రధారులుగా ఈ సినిమా తెరకెక్కింది. అంతకు ముందు పరియేరుమ్ పెరుమాళ్, కర్ణన్ లాంటి క్లాసిక్ సినిమాలు తీసిన మారి సెల్వరాజ్ మామన్నన్ సినిమాను కూడా అదే పంథాలో తెరకెక్కించాడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు రాగా సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈమధ్య కోలీవుడ్ సినిమాలు ఆశించిన స్థాయి ఫలితాలను అందుకోవట్లేదు. ఈ ఇయర్ పొన్నియిన్ సెల్వన్ 2 కాస్త హడావిడి చేయగా పోర్ తొజిల్ సినిమా పబ్లిక్ టాక్ తో హిట్ అందుకుంది. ఇక మామన్నన్ సినిమా విషయానికి వస్తే పోస్టర్స్ తోనే సినిమాపై బజ్ క్రియేట్ చేశాడు దర్శకుడు మారి సెల్వరాజ్. వడివేలుని ఈ సినిమాలో డైరెక్టర్ చూపించిన విధానం బాగుంది.

ఇక మామన్నన్ కథ విషయానికి వస్తే కాశీపురం ఊరిలో ఎమ్మెల్యేగా మామన్నన్ (వడివేలు) పనిచేస్తుంటాడు. అతని కొడుకు ఆదివీరన్ (ఉదయనిధి స్టాలిన్) అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి. లీల (కీర్తి సురేష్) స్టూడెంట్స్ కి ఉచిత కోచింగ్ సెంటర్ నడుపుతుంది.

అయితే లీలను రూలింగ్ పార్టీ నాయకుడైన రత్నవేలు (ఫహద్ ఫాజిల్) వల్ల సమస్యలు వస్తాయి. లీలకు సపోర్ట్ గా ఆదివీరన్, మామన్నన్ లు నిలబడతారు. రత్నవేల్ ని వాళ్లు ఎలా అడ్డుకున్నారు. ఈ క్రమంలో జరిగే రాజకీయ పరిణామాలు ఏంటన్నది సినిమా కథ.

మారి సెల్వరాజ్ సినిమాలన్నీ కూడా పేద ధనిక కాన్సెప్ట్ తోనే ఉంటాయి. మామన్నన్ కూడా అలాంటి కథతోనే కాకపోతే ఈ మూవీలో పొలిటికల్ టచ్ ఇచ్చాడు. ఫస్ట్ హాఫ్ పాత్రల పరిచయం అంతా బాగుంది స్క్రీన్ ప్లే కూడా ఇంప్రెస్ చేస్తుంది. సెకండ్ హాఫ్ రొటీన్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్ బాగా ఉంది. సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్ గా చేసి ఉంటే సినిమా రిజల్త్ మరోలా ఉండేది.

రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకు పెద్ద అసెట్. వడివేలు, ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ కూడా సినిమాకు హెల్ప్ అయ్యాయి. ప్రేక్షకులను మెప్పించడంలో మామన్నన్ సినిమా పాస్ మార్కులు తెచ్చుకున్నట్టే అని చెప్పొచ్చు.