Begin typing your search above and press return to search.

'మా' తెలుగులోనే మాట్లాడతాం!!

By:  Tupaki Desk   |   15 Sep 2017 7:37 AM GMT
మా తెలుగులోనే మాట్లాడతాం!!
X
ప్రస్తుత రోజుల్లో తెలుగుభాషలో ఓ విద్యార్థి పద్యాన్ని చెబితే చూసి నవ్వే పరిస్థితికి దిగజార్చాయి కార్పొరేట్ విద్యాసంస్థలు. అసలు తెలుగు అనే పదం లేకుండా కేవలం ఇంగ్లీష్ లోనే మాట్లాడాలని రూల్స్ కూడా ప్రస్తుతం ప్రయివేట్ స్కూల్స్ లో అమలవుతున్నాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఏ రాష్ట్రం వారైనా వారి భాషకు ఎంతో కొంత గౌరవం ఇచ్చుకుంటారు. ముఖ్యంగా ప్రభుత్వాలు అందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి.

ఇప్పుడు అదే తరహాలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా తెలుగు భాషకు మరో ఊపిరి పొసే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక నుంచి ప్రతి పాఠశాలలో తెలుగు మొదటి సబ్జెక్ట్ ఉండాల్సిందేనని రీసెంట్ గా కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. అలాగే ఇప్పటినుంచి ఇక ఎక్కడైనా సరే ప్రభుత్వ, ప్రైవేట్ బోర్డులు అన్ని ఖచ్చితంగా తెలుగులోనే ఉండాలని నిర్ణయించారు. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి చాలామంది ప్రముఖులు, తెలుగు సంస్కృతి పరిరక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే తరహాలో తెలుగు తెలుగు సినీ కళాకారుల "మా" అసోసియేషన్ కూడా కేసీఆర్ తీసుకున్న నిర్ణయన్నీ ఏకీభవిస్తున్నట్లు చెప్పారు.

తెలుగు పరిరక్షణ భాగంలో మా అసోసియేషన్ కూడా భద్రత వహిస్తుందని మా అధ్యక్షుడు శివాజీ రాజా చెప్పారు. చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి ఏ విషయాన్నీ అయినా ఇక నుంచి తెలుగులోనే ఉత్తరప్రత్యుత్తరాలు జరిపేలా చర్యలు తీసుకుంటామని.. ముఖ్యంగా సినిమాకు సంబందించిన వేడుకలని నిర్వహించే చిత్ర యూనిట్ సభ్యులు కూడా తెలుగులోనే మాట్లాడే విధంగా ఉండేలా చూసుకుంటామని చెప్పారు.