Begin typing your search above and press return to search.

ఏ'మ్మా'.. కాలాక కోకోనట్ ఆయిల్ ఏల??

By:  Tupaki Desk   |   13 April 2018 12:00 AM IST
ఏమ్మా.. కాలాక కోకోనట్ ఆయిల్ ఏల??
X
శ్రీరెడ్డి దెబ్బకి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ దిగి రాక తప్పలేదు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తే.. తీవ్రంగా తప్పు పట్టిన మా.. తర్వాత తమ తప్పు అర్ధం చేసుకుని.. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆహ్వానం పలికేసింది. ఇప్పుడు ఈ విషయంపై ఓ స్పెషల్ కమిటీ వేసి మరీ తప్పొప్పులు ఎవరివో తేలుస్తామని చెబుతున్నారు.

కానీ.. ఇప్పటికే జరగాల్సిన దారుణం జరిగిపోయిన మాట అయితే వాస్తవమే. గతంలో అటూఇటూగా వినిపించిన పేర్లు.. ఇప్పుడు నేరుగా బైటకు వచ్చేశాయి. నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరామ్.. రచయిత కోన వెంకట్ లతో పాటు పలువురి పేర్లు చెప్పేసింది శ్రీరెడ్డి. అయితే.. ఇప్పుడు కమిటీలో మా ఏం సాధిస్తుందన్నదే అర్ధం కాని విషయం. ఈ అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అవ్వాలంటూ ఇప్పటికే డిమాండ్ చేసింది శ్రీరెడ్డి. ఈమె తన పేరు చెప్పడంపై గుర్రుగా ఉన్న కోన వెంకట్.. పోలీసులతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని కోరాడు.

ఇలా ఇప్పుడు ప్రభుత్వ విభాగాలనే మా అసోసియేషన్ ఏర్పాటు చేసే కమిటీ ఏం తేలుస్తుంది.. ఏం నిర్ణయం తీసుకుంటుంది.. దాన్ని ఎవరికి నివేదిస్తుంది.. ఎంతమేరకు ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు ఉపయోగపడతాయన్నది ఆలోచించాల్సిన విషయం. ఇదేదో కాస్త ముందే రియాక్ట్ అయ్యి.. ఈ మాట చెప్పి ఉంటే.. అంతో ఇంతో వెయిట్ ఉండేది. ఇప్పుడు మాత్రం కాలిపోయాక కోకోనట్ ఆయిల్ రాసేందుకు ట్రై చేస్తున్నట్లుగా తయారైంది వ్యవహారం.