Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్ పై ఆర్జీవీ సినిమా.. హ‌ర్ట‌యిన లిరిసిస్ట్‌!

By:  Tupaki Desk   |   29 Jun 2020 11:00 AM IST
ప‌వ‌ర్ స్టార్ పై ఆర్జీవీ సినిమా.. హ‌ర్ట‌యిన లిరిసిస్ట్‌!
X
వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ ఏం చేసినా అది హాట్ టాపిక్కే. ఇటీవ‌ల ఆయ‌న వ్య‌వ‌హార శైలి మ‌రింత వివాదాస్ప‌దంగా మారుతోంది. త‌న‌కు శ‌త్రువులు అని భావించిన ప్ర‌తి ఒక్క‌రిపైనా సినిమాలు తీస్తున్నారు. అవి హిట్ట‌యినా ఫ‌ట్ట‌యినా త‌న‌కు ఏమాత్రం సంబంధం లేదు! అన్న‌ట్టుగానే ఉంది. వివాదాస్ప‌ద క‌థాంశాన్ని ఎంచుకోవ‌డం డూప్లికేట్ల‌ను వెతికి ప‌ట్టుకుని టార్గెట్ చేసిన ప్ర‌ముఖుల‌పై సెటైరిక‌ల్ గా సినిమాలు తీయ‌డం ఆయ‌న‌కు నిత్య‌కృత్యంగా మారింది. ఎన్టీ రామారావు.. చంద్ర‌బాబు.. లోకేష్.. ప‌వ‌న్ క‌ల్యాణ్ .. ఇంకా ఎంద‌రో నాయ‌కుల‌కు సంబంధించి.. డూప్ ల‌ను వెతికి సెటైర్లు వేసిన‌ ఘ‌న‌త ఆయ‌నకే చెల్లింది.

తాజాగా ఆర్జీవీ ప్లాన్ గిట్ట‌ని ప‌వ‌ర్ స్టార్ ఫ్యాన్ కం సీనియ‌ర్ లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి తీవ్రంగా హ‌ర్ట్ అయ్యారట‌. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన కొత్త చిత్రం `పవర్ స్టార్` పై అని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్ అభిమానులకు కోపం ఉప్పొంగింది. ఇప్ప‌టికే రిలీజైన ప‌వ‌న్ డూప్ ఫోటోలు చూసి భ‌గ‌భ‌గ మండుతున్నారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఆర్జీవీ ప్ర‌య‌త్నంపై గుర్రుగా ఉన్నారు. చాలా మంది ఓపెన్ అవ్వ‌క‌పోయినా.. వారిలో ప్రముఖ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి తన నిరాశను వ్య‌క్తం చేశారు.

పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పై RGV మూవీని ప్రకటించిన వెంటనే.. రామజోగయ్య శాస్త్రి ట్విట్టర్ లో త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఆర్జీవీ చేస్తున్న దానికి బాధపడ్డానని తెలిపారు. తన కాలేజీ రోజుల్లో శివుడిని ఆరాధించాక ఆర్జీవీని .. మణిరత్నంని అంత‌గా ఆరాధించేవాడిన‌ని చెప్పారు. “అయితే మీరు ఈ రోజుల్లో మీకు కావలసినది చేస్తున్నారు” అని తీవ్ర ఆవేద‌న‌ను క‌ల‌త‌ను వ్య‌క్తం చేశారు రా.జో శాస్త్రి. ఆర్జీవీకి అభిమాని అయినా కానీ ఇకపై సంబంధాలు తెంచుకునేందుకు సిద్ధ‌మ‌య్యారు రామజోగయ్య. బ‌హుశా త‌న అభిమాన హీరో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ని కించ‌ప‌రిచే సినిమా తీస్తే ఇక ఆర్జీవీకి దూరంగా ఉంటార‌న్న‌మాట‌. కేవ‌లం రామ జోగ‌య్య మాత్ర‌మే కాదు.. ఇండ‌స్ట్రీలో చాలా మంది ఆర్జీవీకి దూర‌మ‌వుతారు. అలాగే ప‌వ‌న్ అభిమానుల నుంచి తీవ్ర‌మైన స‌మ‌స్య‌ల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.