Begin typing your search above and press return to search.

చరణ్‌ ప్రక్కనే వాళ్లెందుకు వచ్చారంటే..

By:  Tupaki Desk   |   19 Dec 2015 7:30 AM GMT
చరణ్‌ ప్రక్కనే వాళ్లెందుకు వచ్చారంటే..
X
మెగాస్టార్ కత్తి రీమేక్ తో రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. బ్రూస్ లీ తో తన ఎంట్రీ ఎలా ఉంటుందో టీజర్ చూపించిన చిరు.. తన 150వ సినిమాగా కోలీవుడ్ మూవీ కత్తిని ఫిక్స్ అయ్యారు. డైరెక్టర్ తో సహా అన్నీ ముందు అనుకున్నవే జరుగుతున్నా.. మూవీ విషయంలో మాత్రం ఒక ఛేంజ్ కనిపిస్తోంది. అదే నిర్మాణ భాగస్వామిగా లైకా ప్రొడక్షన్స్ ఎట్రీ కావడం.

తమిళంలో భారీ చిత్రాలు తీసే సంస్థ లైకా ప్రొడక్షన్స్. ప్రస్తుతం దేశంలో అత్యంత భారీ బడ్జెట్ 400 కోట్ల రూపాయలతో రోబో 2.0కూడా వీళ్లే తీస్తున్నారు. ఈ కంపెనీ చిరుతో సినిమాలో జాయిన్ అవడానికి ఓ కారణం తెలుస్తోంది. నిజానికి కత్తి రీమేక్ పై చాలానే రూమర్స్ వినిపించాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకూ చాలానే పేర్లు డిస్కషన్ లోకి వచ్చాయి. చాలామందే ట్రై చేశారని కూడా చెప్పుకున్నారు. అప్పుుడు లైకా ప్రొడక్షన్స్ ఓ నిర్ణయం చెప్పిందట. టాలీవుడ్ లో ఏ హీరోతో చేసినా.. రీమేక్ రైట్స్ అమ్మేయాలనే భావించారట. ఒకవేళ చిరంజీవి కోసం అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రైట్స్ వేరేవాళ్లకి ఇవ్వకూడదని నిర్ణయించుకుందిట లైకా.

మెగాస్టార్ చేస్తానంటే మాత్రం తామే నిర్మిస్తామని పట్టు పట్టారు లైకా ప్రొడక్షన్స్ అధినేతలు. కానీ అప్పటికే చిరు 150వ సినిమాని మెగాస్టార్ వారసుడు రామ్ చరణ్ తీస్తాడని ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. దీంతో చివరకు సహ నిర్మాణ భాగస్వామిగా అయినా ఉంటేనే, రైట్స్ ఇస్తామని ప్రపోజల్ పెట్టింది లైకా. చివరకు చెర్రీ ఈ ప్రతిపాదనకు అంగీకరించక తప్పలేదు. అలా ఇప్పుడు చిరు సినిమా కోసం ఈ భారీ నిర్మాణ సంస్థ కో ప్రొడక్షన్ కి అంగీకరించింది. చరణ్‌ ప్రక్కన వారు కో-ప్రొడ్యూసర్‌ గా కనిపించనున్నారు.