Begin typing your search above and press return to search.

తేడాలొస్తే లైకా అయిపోయిన‌ట్టే!

By:  Tupaki Desk   |   24 Nov 2018 7:07 AM GMT
తేడాలొస్తే లైకా అయిపోయిన‌ట్టే!
X
2.ఓ ఆట మొద‌లైంది. కాదు.. కాదు! ఇప్ప‌టికే ఆట స‌గం ముగిసింది. రిలీజ్‌ కి 5 రోజుల ముందే.. 500కోట్ల బ‌డ్జెట్‌ లో మూడొంతులు రిట‌ర్న్‌ ల రూపంలో ఖాతాలోకి మ‌ళ్లించుకుంది లైకా సంస్థ‌. ప్రీబిజినెస్‌ తో సేఫ్ గేమ్ ఆడారు. అయితే ఈ తెలివైన ఆట‌లో లైకా సంస్థ‌కు డ‌బ్బులు ఇచ్చుకున్న వాళ్లంతా ఎవ‌రో తెలుసా? అస‌లు త‌మిళ‌నాడుకు చెందిన వాళ్లు కానేకారు. ఇటు ఆంధ్రా - తెలంగాణ వోళ్లు. అటు ఉత్త‌రాది వోళ్లు. ఇత‌ర సౌతిండియా ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన డిస్ట్రిబ్యూట‌ర్లు అన్న‌మాట‌. ఈ ఆట‌లో పావులు డిస్ట్రిబ్యూట‌ర్లు - బ‌య్య‌ర్లు అంటే అతిశ‌యోక్తి కాదు.

ఏపీ - తెలంగాణలో ఎన్‌ వి ప్ర‌సాద్ -ఎన్‌ విఆర్ సినిమా త్ర‌యం ఆట ఆడితే.. ఉత్త‌రాదిన క‌ర‌ణ్ జోహార్ ఆటాడుకుంటున్నారు. మొత్తానికి 2.ఓ చిత్రాన్ని రెట్టించిన హైప్‌ తో భారీ ధ‌ర‌ల‌కు అమ్మేశారు. అయితే ఇంత జ‌రుగుతుంటే త‌మిళ‌నాడులో మాత్రం సీన్ వేరేగా ఉందిట‌. అక్క‌డ ఈ సినిమా కోసం నిర్మాత‌లు భారీ మొత్తాల్ని కోట్ చేయ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు - బ‌య్య‌ర్లు కొనేందుకు జంకార‌ట‌. ఆ క్ర‌మంలోనే త‌మిళ రైట్స్‌ ని అమ్మ‌కుండా సొంతంగా రిలీజ్ చేసుకునే ఎత్తుగ‌డ‌తో లైకా సంస్థ కొత్త ఆట మొద‌లు పెట్టిందిట‌. ఇక‌పోతే ఓవ‌ర్సీస్‌ లోనూ అంతే భారీ ధ‌ర‌లు కోట్ చేయ‌డంతో అక్క‌డ కూడా పంపిణీదారులు కాస్త ఆలోచించార‌ట‌. ఇటీవ‌లే ఓ ఐఎన్‌ సీ సంస్థ‌తో డీల్ పెట్టుకుని లైకా సంస్థ ఓవ‌ర్సీస్ సాంతం సొంతంగా రిలీజ్ ప్లాన్ చేసింద‌ని తెలుస్తోంది. ఓవ‌ర్సీస్ మార్కెట్ల‌కు సంప్ర‌దించాల్సిందిగా కొన్ని ఫోన్ నంబ‌ర్ల‌ను ఇచ్చి ప్ర‌ముఖ వెబ్ సైట్ల‌లోనూ ప్ర‌చారం చేస్తున్నారు.

తెలుగు - హిందీ మార్కెట్ల‌లో పెద్ద రేంజులో బిజినెస్ చేసిన లైకా అధినేత‌లు త‌మిళ‌నాడు - ఓవ‌ర్సీస్‌ లో ఎందుకు చేయ‌లేక‌పోయారు? అన్న కార‌ణం వెతికితే .. ఇటీవ‌లే రిలీజై బంప‌ర్ హిట్ సాధించిన `స‌ర్కార్‌`ని ఎగ్జాంపుల్‌ గా చెప్ప‌డం ఇక్క‌డ కొస‌మెరుపు. స‌ర్కార్ చిత్రం ఆహా ఓహో అనేంత పెద్ద హిట్ట‌యినా - తీరా పంపిణీదారుల వెర్ష‌న్ వ‌ర‌కూ ప‌రిశీలిస్తే అక్క‌డ తీవ్ర నిరాశ ఎదురైందిట‌. స‌ర్కార్ చిత్రాన్ని భారీ మొత్తాల‌కు కొనేయ‌డంతో లాభాల శాతం త‌గ్గిపోయింది. కొన్నిచోట్ల న‌ష్టాలు త‌ప్ప‌లేద‌ట‌. స‌ర్కార్ గేమ్‌ లో నిర్మాత బాగా లాభ‌ప‌డ్డా పంపిణీదారుల లాభం మాత్రం అంతంత మాత్ర‌మేన‌న్న మాటా వినిపించింది. అందుకే ఇప్పుడు 2.ఓ విష‌యంలో భారీగా కోట్ చేయ‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్లు బెంబేలెత్తార‌ట‌. లాభాలొస్తే ఓకే కానీ - న‌ష్టాలొస్తే.. ఫ్లాప్ టాక్ వ‌స్తే ఎలాంటి స‌న్నివేశం ఉంటుందోన‌న్న భ‌యం వెన‌కాడేలా చేసింద‌ని చెబుతున్నారు. మ‌రో కోణంలో చూస్తే తాము చెప్పినంతా డిస్ట్రిబ్యూట‌ర్లు ఇవ్వలేన‌ప్పుడు తామే సొంతంగా రిలీజ్ చేసి లాభ‌ప‌డాల‌ని లైకా సంస్థ డ‌బుల్ గేమ్ ఆడ‌డంతోనే అక్క‌డ అలా జ‌రిగింద‌న్న వాద‌నా వినిపిస్తోంది. 2.ఓ చిత్రం కేవ‌లం త‌మిళ‌నాడులో 750 స్క్రీన్ల‌లో రిలీజ‌వుతోంది. ఈ రిలీజ్ తెలుగు రాష్ట్రాల రిలీజ్ కంటే చాలా త‌క్కువ‌. ప్ర‌పంచ‌వ్యాప్తంగా సుమారు 6800 స్క్రీన్ల‌లో ఈనెల 29న‌ రిలీజ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే.