Begin typing your search above and press return to search.

బడ్జెట్ 360 కోట్లు.. ప్రచారానికి 40 కోట్లు

By:  Tupaki Desk   |   18 Nov 2016 5:06 AM GMT
బడ్జెట్ 360 కోట్లు.. ప్రచారానికి 40 కోట్లు
X
ఇప్పటిదాకా ఇండియాలో హైయెస్ట్ బడ్జెట్ మూవీ ఏదంటే.. మరో మాట లేకుండా ‘బాహుబలి’ పేరే చెబుతున్నాం. రెండు భాగాలకు కలిపి రూ.250 కోట్ల దాకా ఖర్చు పెడుతోంది ‘బాహుబలి’ బృందం. ‘రోబో’ సీక్వెల్ ‘2.0’ ఈ రికార్డును బద్దలు కొట్టబోతోందన్న సంగతి ఎప్పుడో తెలిసినా.. ఈ సినిమా బడ్జెట్ విషయంలో అధికారిక ప్రకటన ఇప్పటిదాకా రాలేదు. దీని బడ్జెట్ రూ.300-400 కోట్ల మధ్య అని రకరకాల వార్తలొచ్చాయి. ఐతే ఇప్పుడు 2.0 నిర్మాణ సంస్థే స్వయంగా దీని బడ్జెట్ గురించి వెల్లడించింది. రోబో సీక్వెల్ మీద ఏకంగా రూ.360 కోట్లు ఖర్చు పెడుతున్నట్లు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతే కాదు.. ఈ చిత్ర ప్రచారానికి మాత్రమే రూ.40 కోట్ల బడ్జెట్ కేటాయించారట. ఈ సంగతి వెల్లడిస్తూ ప్రెస్ నోట్ కూడా ఇచ్చింది లైకా ప్రొడక్షన్స్.

ఈ ఆదివారం ముంబయిలో నిర్వహించబోయే 2.0 ఫస్ట్ లుక్ లాంచ్ కార్యక్రమానికి మాత్రమే రూ.6 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. ఓ సరికొత్త టెక్నాలజీ ద్వారా ఫస్ట్ లుక్ లాంచ్ చేస్తారట. మున్ముందు ప్రచారానికి భారీగానే ఖర్చు చేయబోతున్నారు. ‘బాహుబలి’ విషయంలో చాలా వరకు సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ను ఉపయోగించుకుని అసలు ఖర్చేమీ లేకుండా ప్రమోషన్ కానిచ్చేశాడు రాజమౌళి. కానీ శంకర్ అండ్ టీమ్ మాత్రం ఓ భారీ బడ్జెట్ సినిమా తీయగలిగేంత బడ్జెట్ ను కేవలం ప్రచారానికే ఉపయోగిస్తుండటం ఆశ్చర్యమే. ఇక బడ్జెట్ సంగతి కూడా అధికారికంగా చెప్పేశారు కాబట్టి.. ప్రస్తుతానికి ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ ‘2.0’నే. వచ్చే ఏడాది దసరా లేదా దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుందని అంచనా.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/