Begin typing your search above and press return to search.

అతడిపై నమ్మకంతోనే అలాంటి సీన్.. కియారా

By:  Tupaki Desk   |   21 Jun 2018 10:00 AM GMT
అతడిపై నమ్మకంతోనే అలాంటి సీన్.. కియారా
X
పక్కింటి అమ్మాయి లాంటి లుక్ తో.. అందంగా అమాయకంగా కనిపించడం బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ అస్సెట్. ఆమెకు హిందీలో మొదటగా పేరు తెచ్చిన ఎం.ఎస్.ధోనీ సినిమాలోనూ ఇండియన్ క్రికెట్ టీం కెప్టెన్ అంటే ఎవరో తెలియనంత అమాయకంగా కనిపిస్తుంది. అందుకే మహేష్ లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను సినిమాలో ఆమెను ఏరికోరి హీరోయిన్ గా తీసుకున్నారు.

భరత్ అనే నేనులో సీఎం మనసు దోచుకునే మిడిల్ క్లాస్ అమ్మాయిలా కియారా చాలా క్యూట్ గా కనిపిస్తుంది. దీని తరవాత వెబ్ మూవీ లస్ట్ స్టోరీస్ లో నలుగురు హీరోయిన్లలో ఒకరిగా నటిచింది. ఇందులో ఆమెది మిడిల్ క్లాస్ మ్యారీడ్ ఉమెన్ పాత్ర. లస్ట్ స్టోరీస్ లో కియారా నటించిన ఓ సీన్ ఇప్పుడు చాలా వైరల్ అయింది. ఇంట్లో నలుగురి మధ్య ఉండగా పొరపాటున వైబ్రేటర్ ఆన్ అవడంతో ఆమె ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతోంది. చివరకు అలాగే క్లైమాక్స్ వరకు వచ్చేస్తుంది. ఈ సీన్ చేయడానికి తానేమీ ఇబ్బంది పడలేదని.. అందుకు కారణం డైరెక్టర్ కరణ్ జోహార్ పై ఉన్న నమ్మకమేనని చెప్పుకొచ్చింది కియారా.

కరణ్ జోహార్ వైబ్రేటర్ సీన్ గురించి చెప్పగానే వెంటనే షూట్ కు రెడీ అయిపోయానని చెప్పింది. సెక్స్ లో మహిళల ఫీలింగ్స్ గురించి డిస్కస్ చేయడానికి ఇలాంటి సీను ఉండటంతో తప్పే లేదని అంటోంది. లస్ట్ స్టోరీస్ మొత్తం నలుగురు మహిళల కథగా నడుస్తుంది. ఈ నలుగురిలో ఇప్పుడు అన్నిటికంటే వైరల్ అయింది అందరినీ అట్రాక్ట్ చేస్తోంది వైబ్రేటర్ సీన్ లో కియారా ఎక్స్ ప్రెషన్సే. ఈ దెబ్బతో క్యూట్ గర్ల్ నుంచి హాట్ గర్ల్ అయిపోయింది