Begin typing your search above and press return to search.
పెళ్లి వద్దు - ఎంజాయ్ మెంట్ ముద్దు.. సెలబ్రిటీ లవ్!
By: Tupaki Desk | 9 May 2020 8:00 AM ISTబాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పెళ్లి చేసుకుంటున్నారన్న నమ్మకం అభిమానుల్లో కూడా లేదు. ఎన్నేళ్లు గడిచినా సల్మాన్ పెళ్లి చేసుకుంటాడేమో అని ఎక్కడో చిన్న ఆశ అందరిలో ఉంది. కానీ సల్మాన్ మాత్రం ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గానే మిగిలిపోయాడు. పెళ్లి గురించి ఎన్నిసార్లు అడిగినా తనకు పెళ్లి పై పెద్దగా నమ్మకం లేదంటూ లైట్ తీసుకుంటాడు. ఇప్పటివరకు సల్మాన్ సంగీతా బిజిలానీ, ఐశ్వర్యా రాయ్, కత్రినా కైఫ్‌లతో డేటింగ్ చేశారు. కానీ ఎవ్వరితోను పెళ్లిపీటలు ఎక్కలేదు. ఇక రెండు సంవత్సరాల కింద లులియా వాంటూర్ అనే రొమేనియన్ మోడల్‌ను ముంబయిలోని ఇంటికి తీసుకొచ్చి ఇంట్లోవారికి పరిచయం చేశాడు. దాంతో అందరూ పెళ్లి చేసుకోబోతున్నాడని అనుకుంటే.. అలా అనుకోవడం పొరపాటు అని నిరూపించాడు.
అంతేగాక లులియాను కొంతకాలం ఇంట్లోనే ఉంచాడు. ఆమె కూడా సల్మాన్ ఇంట్లోవారితో కూడా చక్కగా కలిసిపోయింది. ఇక తాజాగా సల్మాన్ చూస్తుండగానే లులియా పెళ్లి కూడా అయిపోయేలా అన్పిస్తుంది. ఇటీవల లులియా ఓ ఇంటర్య్వూలో తన పెళ్లి గురించి పెదవి విప్పి షాక్ ఇచ్చింది. ఆమె సమాధానం వింటే.. ఆమె పెళ్లి కాదు కానీ వేరే ఏదైనా మాట్లాడండి అన్నట్లు బదులిచ్చింది. నన్ను నా పేరెంట్స్ కూడా కొంతకాలంగా పెళ్లి గురించి అడుగుతున్నారు. కానీ నేను ఓకే అంటే ఇపుడే చేసేలా ఉన్నారు. నాకేమో పెళ్లిమీద పెద్దగా ఇంటరెస్ట్ లేదు. పెళ్లి మాట పక్కన పెడితే.. ఇష్టపడిన వారితో ఎంతకాలం ఎంజాయ్ చేశామన్నది ముఖ్యం అని చెప్తుంది. ఇక సల్మాన్ సమాధానం వింటే.. నాకు పెళ్లి వద్దు కానీ పిల్లలు కావాలి అన్నట్లుగా మాట్లాడి తప్పించుకుంటున్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకొనే ఉద్దేశంలో లేరని అర్ధమవుతుంది.