Begin typing your search above and press return to search.

`ఆహా`లో లూకా అలియాస్ జానీ క‌థేమిటో?

By:  Tupaki Desk   |   28 Feb 2021 7:44 AM
`ఆహా`లో లూకా అలియాస్ జానీ క‌థేమిటో?
X
మ‌ల‌యాళంలో ఎన్నో క్లాసిక్ హిట్స్ ఉన్నాయి. వాటన్నిటినీ తెలుగైజ్ చేసి అందించేందుకు ఇన్నాళ్లు స‌రైన వేదిక లేనే లేదు. ఆహా - తెలుగు ఆ లోటును తీరుస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా ఒక క్లాసిక్ ల‌వ్ స్టోరీని ఆహా  స్ట్రీమింగుకి సిద్ధం చేస్తోంది. లూకా అలియాస్ జానీ అనే ఆస‌క్తిక‌ర టైటిల్ తో ఈ మూవీని రిలీజ్ చేయ‌‌డం విశేషం.

లూకా అనేది 2019 భారతీయ మలయాళ చిత్రం. అరుణ్ బోస్ దర్శకత్వం వహించారు. లింటో థామస్ - ప్రిన్స్ హుస్సేన్ స్టోరీస్ అండ్ థాట్స్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు. ఒరిజిన‌ల్ వెర్ష‌న్ ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎట్ట‌కేల‌కు దానిని అహా ఓటీటీ ద్వారా తెలుగులో డబ్బింగ్ వెర్షన్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ చిత్రానికి మృదుల్ జార్జ్ సహ రచయిత. టోవినో థామస్ - అహనా కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు.

పోలీసు అధికారి అక్బర్ (నితిన్ జార్జ్) దర్యాప్తు క్ర‌మంలో ఊహించని సంఘటనతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. అక్బర్ చదివిన డైరీ లూకా (టోవినో థామస్) - నిహారికా (అహానా కృష్ణ) జీవితాల ద్వారా ప్రేక్షకులను మ‌రో లోకంలోకి తీసుకువెళుతుంది. ఆ డైరీనే కథకుడి పాత్రను పోషిస్తుంది.

లూకా (జానీ) త‌న‌ చిన్ననాటి స్నేహితుల సర్కిల్ లో ప్రతిభావంతులైన స్క్రాప్ ఆర్టిస్ట్. లూకాకు తన కోపాన్ని ఎలా నియంత్రించాలో తెలియదు. చికాకు పుడితే హింసాత్మక పంథాలో దానిని వ్యక్తపరుస్తాడు. ఆ క్ర‌మంలోనే నీహారిక ప‌రిచ‌యమ‌వుతుంది. ఆ త‌ర్వాత క‌థేంటి? అన్నది ఆస‌క్తిక‌రం. ఆహా లో ఇప్ప‌టికే ఒరిజిన‌ల్ కంటెంట్ ఆక‌ట్టుకుంటోంది. దీంతో పాటే ఇలాంటి విష‌యం ఉన్న సినిమాల‌తో మ‌రింత‌గా స‌బ్ స్క్రిప్ష‌న్ల‌ను పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.