Begin typing your search above and press return to search.

అఖిల్ ని బన్నీవాసు గట్టెక్కిస్తాడా..?

By:  Tupaki Desk   |   19 March 2020 3:30 PM GMT
అఖిల్ ని బన్నీవాసు గట్టెక్కిస్తాడా..?
X
కెరీర్ లో ఫస్ట్ సినిమా నుండి కూడా సరైన హిట్ ను అందుకోలేకపోయాడు అక్కినేని అఖిల్. ఇప్పటికే మూడు సినిమాలు చేసినా ఒక్క సినిమా కూడా తనకు బ్లాక్ బస్టర్ రుచిని చూపించ లేకపోయాయి. కానీ అఖిల్ కి అభిమానుల ఫాలోయింగ్ మాత్రం బాగానే ఉంది. తండ్రి అక్కినేని నాగార్జున, అన్న నాగచైతన్య అభిమానులు ఒక మంచి సినిమాతో వస్తే ఆదరించడానికి సిద్దంగానే ఉన్నారు. కానీ చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండటంతో అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఆలోచనలో పడ్డారు.

మిస్టర్ మజ్ను సినిమా అనంతరం చాలా గ్యాప్ తీసుకొని బొమ్మరిల్లు భాస్కర్ కథను ఓకే చేసాడు అఖిల్. కానీ బొమ్మరిల్లు భాస్కర్ కూడా వరుస ప్లాపులలో ఉండటంతో అభిమానులలో అక్కినేని అభిమానులలో ఆందోళన మొదలైంది. ఇద్దరు కూడా ప్లాపులలో ఉన్నారు ఎలా కుదిరింది అనుకుంటుంటే.. స్క్రిప్ట్ లో దమ్ముంది అని చెప్తున్నారు. ఈ సినిమాకు 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' అని టైటిల్ ని ఫిక్స్ చేసారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీవాసు, వాసు వర్మలు సినిమాను నిర్మిస్తున్నారు.

ఏప్రిల్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఈ సినిమా సగం షూటింగ్ ఇంకా పూర్తికాలేదని సమాచారం. అంతేగాక కరోనా కారణంగా షూటింగ్స్ వాయిదా పడుతున్న సంగతి తెలిసిందే. కరోనా వలన షూటింగ్ వాయిదా పడటంతో నిర్మాత బన్నీవాసు ఈ సినిమాను ఆగష్టులో విడుదల చేస్తారేమోనని సినీ ఇండస్ట్రీ గుసగుసలాడుతుంది. ఎందుకంటే బన్నీవాసుకు ఆగష్టు నెల లక్కీ అనే సెంటిమెంట్ ఉన్నట్లు సమాచారం. మరి ఈ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమాను తన లక్కీ నెలలోనే విడుదల చేయడానికి ప్లాన్ లో ఉన్నారేమో అని భావిస్తున్నారు. చూడాలి మరి ఎలాంటి ఖబర్ రానుందో.!