Begin typing your search above and press return to search.

లూసీఫ‌ర్ స్క్రిప్టు రెడీ.. బాస్ ఫుల్ హ్యాపీస్‌.. షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్!

By:  Tupaki Desk   |   16 March 2021 1:06 PM GMT
లూసీఫ‌ర్ స్క్రిప్టు రెడీ.. బాస్ ఫుల్ హ్యాపీస్‌.. షూటింగ్ కు గ్రీన్ సిగ్నల్!
X
రీ-ఎంట్రీ త‌ర్వాత మెగాస్టార్ చిరంజీవి య‌మా స్పీడు మీదున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న ఏకంగా నాలుగు సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. ఇందులో మొద‌టిది ఆచార్య‌. స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి గుమ్మ‌డి కాయ‌కూడా కొట్టేశారు. స‌మ్మ‌ర్ లో స్లాట్ బుక్ చేసిన ఈ మూవీని.. మే 13న గ్రాండ్ గా రిలీజ్ చేయ‌బోతున్నారు.

ఈ మూవీ త‌ర్వాత లైన్లో ఉన్న‌ది మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ‘లూసిఫ‌ర్’ అన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే కొబ్బ‌రి కాయ కొట్టిన ఈ మూవీ.. రెగ్యుల‌ర్ షూట్ కోసం వెయిట్ చేస్తోంది. అయితే.. అందుతున్న లేటెస్ట్ అప్డేట్ ప్ర‌కారం.. షూట్ కు స‌ర్వం సిద్ధ‌మైపోయిందట.

స్క్రిప్టులో మార్పులు చేర్పులు అన్నీ ప‌క్కాగా ఫినిష్ అయిపోయాయ‌ట‌. తెలుగు నేటివిటీతోపాటు, మెగా అభిమానుల‌ను అల‌రించే అంశాల‌ను కూడా యాడ్ చేశార‌ట‌. మెగాస్టార్ నుంచి ప్రేక్ష‌కులు ఆశించే అన్ని కోణాలు ఇందులో ఉండేట్టు చూసుకున్నాడ‌ట ద‌ర్శ‌కుడు.

అంతా సిద్ధం చేసి ఫైన‌ల్ స్క్రిప్టును మెగాస్టార్ కు చూపించాడ‌ట‌. అది చూసిన చిరంజీవి పూర్తిస్థాయిలో సంతృప్టి చెందాడ‌ట‌. అంతేకాదు.. వెంట‌నే షూటింగ్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశాడ‌ట‌. దీంతో.. మండుతున్న ఎండ‌ల్లోనే లూసీఫ‌ర్ ప‌ట్టాలెక్క‌బోతోంది. ఏప్రిల్ రెండో వారం నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూట్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నార‌ట‌.