Begin typing your search above and press return to search.

లూసీఫ‌ర్ రీమేక్ టైటిల్ ఇదేన‌ట‌గా..?

By:  Tupaki Desk   |   30 March 2021 7:30 AM GMT
లూసీఫ‌ర్ రీమేక్ టైటిల్ ఇదేన‌ట‌గా..?
X
సినిమాకు క‌థ ఎంత ముఖ్య‌మో.. టైటిల్ కూడా అంతే ప్ర‌ధానం. కేవ‌లం టైటిల్ స‌రిగా లేని కార‌ణంగా దెబ్బ తిన్న సినిమాలు కూడా ఉన్నాయి. అందుకే.. మేక‌ర్స్ ఆచితూచి, అన్ని అంశాల‌నూ కాచి వ‌డ‌బోసి, ఓ టైటిల్ సిద్ధం చేస్తారు. అయితే.. ఆ పేరు క‌థ‌ను ప్ర‌తిబింబించ‌డంతోపాటు హీరో స్టార్ డ‌మ్ ను కూడా చాటి చెప్పాల్సి ఉంటుంది. అందుకే.. టైటిల్ అత్యంత ముఖ్యం.

రీ-ఎంట్రీ త‌ర్వాత జోరు కొన‌సాగిస్తున్న చిరు.. ఈ మ‌ధ్య‌నే ఆచార్య‌కు గుమ్మ‌డి కాయ కొట్టేశారు. ఆ త‌ర్వాత లూసీఫ‌ర్ ను సెట్స్ మీద‌కు తీసుకెళ్ల‌డానికి రంగం సిద్ధం చేస్తున్నారు. స్క్రిప్టు కూడా పూర్తిగా చ‌దివేసిన మెగాస్టార్‌.. గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశార‌ట‌. దీంతో.. ఉగాది త‌ర్వాత ఈ సినిమా రెగ్యుల‌ర్ షూట్ మొద‌లు కానుంద‌ని స‌మాచారం.

కాగా.. ద‌ర్శ‌కుడు బాబితో చిరు ఓ సినిమా చేయ‌బోతున్న విష‌యం తెలిసిందే. మైత్రి మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం స్క్రిప్టు ప‌క్కాగా ప్లాన్ చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు. అయితే.. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ ఇదేనంటూ ఈ మ‌ధ్య ఓపేరు చ‌ర్చ‌ల్లోకి వ‌చ్చింది. ‘వీరయ్య’ అనే టైటిల్ పెడుతున్నారంటూ ప్రచారం సాగింది. ఇది విన్నవారంతా.. మెగాస్టార్ కు ఇలాంటి టైటిలా? అనుకున్నారు. అయితే.. అందంతా ఫేక్ అని యూనిట్ కొట్టిపారేసింది.

తాజాగా.. ఇప్పుడు లూసీఫ‌ర్ టైటిల్ ఇదేనంటూ మ‌రో న్యూస్ వైర‌ల్ అవుతోంది. మోహన్ రాజా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి ‘రారాజు’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై యూనిట్ ఇంకా స్పందించలేదు. మరి, నిజంగానే ఈ పేరు ప‌రిశీల‌న‌లో ఉందా? అనేది కొన్ని రోజులు గ‌డిస్తేగానీ తెలియ‌దు.