Begin typing your search above and press return to search.

ప్రియుడు మారినా టాట్టూ మారునా?

By:  Tupaki Desk   |   5 Oct 2019 1:50 PM GMT
ప్రియుడు మారినా టాట్టూ మారునా?
X
తెలుగు.. త‌మిళ భాష‌ల్లో లేడీ సూప‌ర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది న‌య‌న‌తార‌. గ‌త కొంత కాలంగా కోలీవుడ్ కు చెందిన యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివ‌న్ తో న‌య‌న్ ప్రేమాయ‌ణం సాగిస్తోంది. ప్ర‌భుదేవాతో ప్రేమ వైఫ‌ల్యం త‌ర్వాత‌ సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌నుకున్న స‌మ‌యంలో న‌య‌న‌కు లైఫ్ పై ధీమాను క‌లిగించిన వ్య‌క్తి విఘ్నేష్ శివ‌న్‌. అందుకే అత‌నికి న‌య‌న ద‌గ్గ‌రైంద‌ని ఓ మీడియా సంస్థ‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్వూలో స్వ‌యంగా న‌య‌న‌తార వెల్ల‌డించ‌డం విశేషం. త్వ‌ర‌లో ఈ జంట వివాహ బంధంతో ఒక్క‌టి కాబోతున్నారు. డిసెంబ‌ర్ లో ముహూర్తం కూడా ఫిక్స్ చేసిన‌ట్టు ప్ర‌చారం సాగుతోంది.

కోరుకున్న వాడితో న‌య‌న్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వేళ ఓ ఆస‌క్తిక‌ర అంశం వైర‌ల్ గా మారింది. ప్ర‌భుదేవాతో ప్రేమాయ‌ణంలో వుండ‌గా న‌య‌న‌తార త‌న పేరుని లెఫ్ట్ హ్యాండ్ పై టాటూ వేయించుకుంది. ప్ర‌స్తుతం ఆ టాట్టూ చెరిగిపోయిందా? అంటూ అభిమానులు ఒక‌టే ఆరాలు తీస్తుంటే షాకిచ్చే నిజ‌మే తెలిసింది.

ప్రియుడిని మార్చిందే కానీ న‌య‌న్ టాట్టూని మాత్రం చెరిపేయ‌లేక‌పోయింది. టాట్టూలో పి అనే ఆంగ్ల అక్ష‌రం అలానే ఉంద‌ట‌. పీ త‌ప్ప మిగ‌తా అక్ష‌రాలు త‌మిళ భాష‌లో వుండేలా చూసుకుంది. ఇప్పుడు ఆ టాటూ హాట్ టాపిక్ గా మారింది. గ‌తంలో న‌య‌న‌తార ఆ టాట్టూని బ్యాంకాక్ లో తీసేయించుకుంద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అయితే అందులో ఎలాంటి నిజం లేద‌ని ఆమె తాజా ఫొటోల్లో తేలిపోయింది.

'శ్రీ‌రామ‌రాజ్యం' త‌రువాత ప్ర‌భుదేవాని పెళ్లి చేసుకుని సినిమాల‌కు గుడ్ బై చెప్పాల‌ని.. ముంబైలో సెటిల‌వ్వాల‌ని న‌య‌న‌తార ఎన్నో క‌ల‌లు కంది. కానీ అవి క‌ల్లలే అయ్యాయి. తాజాగా విఘ్నేష్ శివ‌న్ ని పెళ్లాడ‌నుంద‌ని వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబ‌ర్‌ 25న విదేశాల్లో వీరి వివాహం చేయ‌డానికి నిర్ణియించార‌ట‌. ఈ ద‌ఫా అయినా న‌యన క‌ల ఫిలించాల‌ని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.

న‌య‌న‌తార ప్ర‌స్తుతం త‌మిళంలో విజ‌య్ తో 'బిగిల్‌'.. ర‌జ‌నీతో ద‌ర్బార్‌' చిత్రాల్లో న‌టిస్తోంది. చిరంజీవితో ఆమె తొలిసారి క‌లిసి న‌టించిన 'సైరా న‌ర‌సింహారెడ్డి' ఈ నెల 2న ప్ర‌పంచ వ్యాప్తంగా నాలుగు భాష‌ల్లో విడుద‌లైన విష‌యం తెలిసిందే.