Begin typing your search above and press return to search.

లవ్ టుడే రీమేక్.. నాకేం సంబంధం లేదన్న బోనీ కపూర్..!

By:  Tupaki Desk   |   3 Jan 2023 2:30 AM GMT
లవ్ టుడే రీమేక్.. నాకేం సంబంధం లేదన్న బోనీ కపూర్..!
X
బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ తనకు సంబంధం లేని ఒక సినిమా విషయంలో తన పేరుని ప్రస్తావించడం చూసి ఆ సినిమా విషయంలో క్లారిటీ ఇచ్చారు. స్టార్ ప్రొడ్యూసర్ గా అటు హిందీలోనే కాదు తమిళంలో కూడా సినిమాలు చేస్తూ వస్తున్నారు బోనీ కపూర్. లేటెస్ట్ గా అజిత్ తో తునివు సినిమా కూడా తెరకెక్కించారు బోనీ కపూర్. అజిత్ తునివు సినిమా తెలుగులో కూడా రిలీజ్ అవుతుంది. తెగింపు టైటిల్ తో ఈ సినిమా వస్తుందని తెలుస్తుంది.

ఇక ఇదిలా ఉంటే తనకు ఏమాత్రం సంబంధం లేని లవ్ టుడే సినిమా విషయంలో ఆయన పేరుని ప్రస్తావిస్తూ వార్తలు రాస్తున్నారు. ప్రదీప్ రంగనాథ్ హీరోగా ఇవనా హీరోయిన్ గా నటించిన సినిమా లవ్ టుడే. చిన్న బడ్జెట్ తో రిలీజైన ఈ సినిమా తమిళంలో సూపర్ సక్సెస్ అయ్యింది. తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా సూపర్ హిట్ అందుకుంది. యూత్ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకున్న ఈ సినిమా హిందీ రీమేక్ ని బోనీ కపూర్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలపై స్పందించారు బోనీ కపూర్. తన సోషల్ మీడియాలో లవ్ టుడే రైట్స్ తన దగ్గర లేవని. ఆ సినిమా తను హిందీలో రీమేక్ చేస్తున్నట్టుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్పారు బోనీ కపూర్. స్వయంగా ఆయన రెస్పాండ్ అయ్యారు అంటే ఈ ప్రచారం ఏ రేంజ్ లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. లవ్ టుడే బాలీవుడ్ రీమేక్ కి క్రేజీ ఆఫర్లు వస్తున్నాయట.

బోనీ కపూర్ లవ్ టుడే సినిమాని హిందీలో రీమేక్ చేస్తారని కోలీవుడ్ మీడియా కవర్ చేసింది. దానితో బోనీ కపూర్ రెస్పాన్స్ అవ్వాల్సి వచ్చింది. లవ్ టుడే సినిమా హిందీలో కూడా బాగా వర్క్ అవుట్ అవుతుందని చెప్పొచ్చు. అక్కడ యంగ్ హీరో ఈ సినిమాని చేస్తే బాగా కనెక్ట్ అవుతుంది. అయితే హిందీ వర్షన్ ని కూడా ప్రదీప్ రంగనాథ్ డైరెక్ట్ చేస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.