Begin typing your search above and press return to search.

హీందిలో లవ్ టూడే.. ఆ హీరో చేతికి!

By:  Tupaki Desk   |   2 Jan 2023 3:56 AM GMT
హీందిలో లవ్ టూడే.. ఆ హీరో చేతికి!
X
ఇటీవల కాలంలో తమిళంలో పెద్దగా అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లవ్ టుడే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నేటి తరం ప్రేమికుల మధ్యలోనే అనేక రకాల సమస్యలను తీసుకొని ఒక చిన్న పాయింట్ తో మంచి కథను అల్లుకున్న దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తనే హీరోగా నటించి అద్భుతమైన సినిమాను తెరపైకి తీసుకువచ్చాడు.

ఇక ఈ సినిమాను తెలుగులో కూడా డబ్బింగ్ చేయగా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మరిన లవ్ టుడే సినిమాను హిందీలో కూడా విడుదల చేయాలని అనుకున్నారు. కానీ అక్కడ రీమేక్ చేయాలి అని మరి కొంతమంది యువ హీరోలు ప్రయత్నాలు చేస్తూ ఉండడంతో నిర్మాతలు సినిమా కథ హిందీ హక్కులను అమ్మేందుకు రెడీ అయినట్లుగా తెలుస్తోంది.

ఇక హిందీలో హీరోగా ఎవరు నటించబోతున్నారు అనే విషయంలో కూడా ఒక టాక్ వైరల్ గా మారింది. యువ హీరో వరుణ్ ధావన్ పేరు అయితే ఎక్కువగా వినిపిస్తోంది. ఇంతకుముందే వరుణ్ ధావన్ తెలుగు సినిమాలను హిందీలో రీమేక్ చేసి బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ అయితే అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ హీరో లవ్ టుడే సినిమాను రీమేక్ చేయాలని తన తండ్రితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

వరుణ్ ధవన్ తండ్రి డేవిడ్ ధావన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో కమర్షియల్ సినిమాలను తెరపైకి తీసుకువచ్చి పలు విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే లవ్ టుడే సినిమాను తెరపైకి తీసుకువచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తిగా హిందీ ప్రేక్షకులకు నచ్చే విధంగా కంటెంట్ లో కొంత మార్పులు కూడా చేయబోతున్నారట. ఇక మరోవైపు వరుణ్ ధావన్ ఆమెజాన్ ప్రైమ్ నిర్మిసున్న ఒక బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడు. అందులో సమంత కథానాయిక.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.