Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

By:  Tupaki Desk   |   18 Aug 2021 5:58 AM GMT
లవ్ స్టోరీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!
X
యువసామ్రాట్ అక్కినేని నాగ చైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ''లవ్ స్టోరీ''. ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సమ్మర్ లో రిలీజ్ కావల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడింది. అప్పటి నుంచి రేవంత్ - మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తిరిగి ఓపెన్ అవడంతో ఈ సినిమా విడుదల తేదీని ఖరారు చేసారు. వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న ఈ చిత్రాన్ని థియేటర్ లలో రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

''లవ్ స్టోరీ'' రిలీజ్ డేట్ అనౌన్సమెంట్ సందర్భంగా మేకర్స్ ఓ బ్యూటిఫుల్ పోస్టర్ ని విడుదల చేశారు. ఇందులో నాగచైతన్య - సాయి పల్లవి ఇద్దరూ ఉల్లాసంగా ఒకరి చేతులు ఒకరు పట్టుకుని పరుగెత్తుతూ కనిపిస్తున్నారు. కాగా, పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం విశేషం. సెప్టెంబర్ 10న ఈ మూవీ థియేటర్ రిలీజ్ కు రావడం అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది.

ఇప్పటికే విడుదలైన లవ్ స్టొరీ ప్రచార చిత్రాలు - పాటలు అనూహ్య స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా యూట్యూబ్ వ్యూస్ లో 'సారంగ దరియా' సాంగ్ ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా' 'నీ చిత్రం చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను విశేషంగా ఆకట్టుకొని.. మిలియన్ల కొద్దీ వ్యూస్ సంపాదించాయి. లవ్ స్టొరీ మ్యూజికల్ గా హిట్ అవడంతో సినిమా మీద మరిన్ని అంచనాలు పెరిగాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే ప్లెజంట్ - ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయని తెలుస్తోంది.

'లవ్ స్టొరీ' చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం సమకూర్చారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.