Begin typing your search above and press return to search.
అక్కినేని హీరో `లవ్ స్టోరి` నాన్ థియేట్రికల్ బిజినెస్
By: Tupaki Desk | 1 July 2020 9:00 AM ISTశేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య `లవ్ స్టోరి` అనే చిత్రం చేస్తున్నారన్నది అందరికీ తెలిసిన విషయమే. 90శాతం చిత్రీకరణ పూర్తయింది. కొన్ని రోజుల షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఈ చిత్రంలో నాగచైతన్య నైజాం యాస మాట్లాడే కుర్రాడిగా నటిస్తుండగా.. సాయిపల్లవి అతడి లవర్ గా నటిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం.. ఈ మూవీ నాన్-థియేట్రికల్ హక్కులను మేకర్స్ 18 కోట్లకు విక్రయించారని తెలుస్తోంది. డిజిటల్- శాటిలైట్ సహా డబ్బింగ్ హక్కులు కలుపుకుని ఇంత బిజినెస్ సాగింది. చైతన్య రేంజుకి ఇది బెస్ట్ బిజినెస్. త్వరలో పెండింగ్ చిత్రీకరణను పూర్తి చేస్తారని తెలుస్తోంది. మహమ్మారీ లాక్ డౌన్ వల్ల అన్ని సినిమాల్లానే చిత్రీకరణ ఆలస్యమైంది.
అలాగే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేస్తారని ప్రచారం ఉంది. కానీ థియేట్రికల్ రిలీజ్ కోసం మేకర్స్ ఆసక్తిగా వేచి చూస్తున్నారు. మహమ్మారీ శాంతించి థియేటర్లు తెరుచుకుంటే భారీ ఎత్తున రిలీజ్ చేయాలన్నది ప్లాన్. కానీ అందుకు ఇంకా చాలా సమయమే పట్టేట్టు కనిపిస్తోంది.