Begin typing your search above and press return to search.

కొత్త కండీషన్: ఆ ఒక్కటి తప్ప.. ఏమైనా అడగండి ఫర్లేదు

By:  Tupaki Desk   |   20 Sept 2021 12:01 PM IST
కొత్త కండీషన్: ఆ ఒక్కటి తప్ప.. ఏమైనా అడగండి ఫర్లేదు
X
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు రెండే అంశాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒకటి.. సినిమా పెద్ద సినిమాల్ని రిలీజ్ చేస్తే థియేటర్లకు గతంలో మాదిరి పోటెత్తుతారా? ఫ్యూచర్ ఏమిటన్నది అయితే.. రెండోది నాగ చైతన్య.. సమంతలు విడిపోతున్నారా? వారి మధ్య అసలేమైంది? ఎందుకీ అంశం తరచూ చర్చకు వస్తోంది? చైతూ కానీ సామ్ కానీ ఫుల్ క్లారిటీ ఇచ్చేయొచ్చుగా? అని.

ఇదిలా ఉంటే.. రెండో అంశానికి సంబంధించిన ఒక ఉదంతం ఆసక్తికర చర్చకు తెర తీసింది. ఆదివారం లవ్ స్టోరీ ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగటం.. దానికి బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ హాజరు కావటం తెలిసిందే. ఇదే వేడుకకు మెగాస్టార్ చిరంజీవి కూడా హాజరయ్యారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ వేడుక కవరేజ్ కు వెళ్లిన మీడియా ప్రతినిధులకు మొదటే కండీషన్ పెట్టినట్లు చెబుతున్నారు.

మీరు ఎవరినైనా ఏమైనా అడగండి ఫర్లేదు కానీ.. చైతూ.. సామ్ వ్యవహారం గురించి మాత్రం మాట్లాడొద్దు. నాగ చైతన్యను ఆ ప్రశ్న మాత్రం వేయొద్దని చెబుతూ.. రిక్వెస్టు చేసినట్లు తెలుస్తోంది. దీనికి తోడు పై స్థాయి నుంచి కూడా మాట రావటంతో.. మీడియా ప్రతినిధులు (కొంతమంది ఆన్ లైన్ లో చూస్తూ కవర్ చేస్తే.. మరికొందరు ఆఫ్ లైన్ కవరేజ్ చేపట్టారు) లవ్ స్టోరీ ఫంక్షన్ కు వచ్చారే కానీ.. మనసులోని ప్రశ్నను.. మనసులోనే ఉంచేసుకొని మౌనంగా వెళ్లిపోయారు. ఇన్ని కండీషన్లు పెట్టే బదులు.. విషయం ఏదో చెప్పేస్తే సరిపోతుంది కదా? అన్న మాట వినిపిస్తోంది. ఈ వ్యవహారం మీడియా సర్కిల్స్ తో హాట్ టాపిక్ గా మారినట్లు తెలుస్తోంది.