Begin typing your search above and press return to search.

'లవ్ స్టోరీ' కొత్త రిలీజ్ డేట్..!

By:  Tupaki Desk   |   10 Sep 2021 9:32 AM GMT
లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేట్..!
X
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన తాజా చిత్రం ''లవ్ స్టొరీ''. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఏప్రిల్ లోనే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. చివరిగా వినాయక చవితి సంధర్భంగా ఈరోజు (సెప్టెంబర్ 10) ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఈ చిత్రాన్ని మరో రెండు వారాలు పోస్ట్ పోన్ చేశారు.

'లవ్ స్టోరీ' మూవీ మేకర్స్ తాజాగా విడుదల తేదీపై క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాతలు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. ''ప్రస్తుత పరిస్థితుల వల్ల 'లవ్ స్టొరీ' సినిమా విడుదల వాయిదా వేస్తున్నాం. ఈ సినిమాని మీకు చూపించడానికి మేము చాలా ఆసక్తిగా ఉన్నాము.ప్రపంచ వ్యాప్తంగా 2021 సెప్టెంబర్ 24న ఈ చిత్రాన్ని గ్రాండ్ గా థియేట్రికల్ రిలీజ్ చేయబడుతుంది'' అని మేకర్స్ పేర్కొన్నారు.

సక్సెస్ జోష్ లో ఉన్న శేఖర్ కమ్ముల - నాగచైతన్య - సాయి పల్లవి నుంచి వస్తున్న 'లవ్ స్టోరీ' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చైతూ కెరీర్ లో ఇది బెస్ట్ మూవీగా నిలిచిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు - పాటలు మంచి స్పందన తెచ్చుకున్నాయి. ముఖ్యంగా 'సారంగధరియా' పాట మిలియన్ల కొలదీ వ్యూస్ రాబడుతూ, యూట్యూబ్ లో రికార్డులు క్రియేట్ చేస్తోంది.

'లవ్ స్టొరీ' చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్ - పి. రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరించారు. పవన్ సి.హెచ్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా మార్తాండ్ కె.వెంకటేష్ ఎడిటింగ్ వర్క్ చేశారు. ఈ చిత్రంలో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.