Begin typing your search above and press return to search.

'ఆచార్య' ప్లేస్ లో చైతూ 'లవ్ స్టోరీ'..?

By:  Tupaki Desk   |   16 April 2021 7:30 AM GMT
ఆచార్య ప్లేస్ లో చైతూ లవ్ స్టోరీ..?
X
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య - నేచురల్ బ్యూటీ సాయి పల్లవి జంటగా నటించిన ''లవ్ స్టోరీ'' సినిమా విడుదల వాయిదా పడిన సంగతి తెలిసిందే. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ముందుగా ఏప్రిల్ 16న తెలుగు కన్నడ మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. అయితే కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న కారణంగా వాయిదా వేస్తున్నామని.. పరిస్థితులు అనుకూలించిన తరువాత విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. అయితే ఇప్పుడు వచ్చే నెలలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి మేకర్స్ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.

కోవిడ్ పరిస్థితులు చక్కబడి, థియేటర్ ఆక్యుపెన్సీని 50 శాతానికి తగ్గించకుంటే మే 13న 'లవ్ స్టోరీ' చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. ఇప్పటికే మే 13న మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు 'ఆచార్య' వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే పరిస్థితులు అన్నీ అనుకూలిస్తే ఆ తేదీని 'లవ్ స్టోరీ' తో ఫిల్ చేయొచ్చని.. మే 2 వ వారమే సరైన తేదీ అని నిర్మాతలు చర్చించుకుంటున్నారట. మరి రాబోయే రోజుల్లో కరోనా మహమ్మారి ప్రభావం ఏ విధంగా ఉంటుందో చూడాలి.

కాగా, ఇప్పటికే విడుదలైన 'లవ్ స్టోరీ' చిత్రానికి సంబంధించిన పోస్టర్స్- టీజర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. 'ఏయ్ పిల్లా' 'నీ చిత్రం చూసి' 'సారంగ దరియా' 'ఏవో ఏవో కలలే' వంటి పాటలు మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ రికార్డ్స్ ని బ్రేక్ చేస్తున్నాయి. ఈ చిత్రానికి పవన్ సి.హెచ్ సంగీతం సమకూరుస్తుండగా.. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇందులో రాజీవ్ కనకాల - ఈశ్వరీ రావు - దేవయాని కీలక పాత్రలు పోషించారు. సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ - అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై కె.నారాయణదాస్ నారంగ్ - పి.రామ్మోహన్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.