Begin typing your search above and press return to search.
ఆగస్టులో నాగచైతన్య 'లవ్ స్టోరీ' షురూ కానుందా..??
By: Tupaki Desk | 20 July 2020 11:15 AM ISTసెన్సిబుల్ హీరో అక్కినేని నాగ చైతన్య, సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'లవ్ స్టోరీ'. ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయినుగా నటిస్తోంది. వాస్తవానికి ఈ లవ్ స్టోరీ ఏప్రిల్ నెలలోనే విడుదల కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం కావడం, ఆ వెంటనే కరోనా లాక్‌డౌన్ అమలులోకి రావడంతో సినిమా విడుదల వాయిదా పడుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మూవీ అప్‌డేట్స్ అందిస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తుంది శేఖర్ కమ్ముల టీమ్. ఇదివరకే హే పిల్ల.. అనే సాంగ్ విడుదల చేసి ప్రేక్షకులలో మంచి లవ్ ఫీలింగ్ కలిగించారు. ఫస్ట్ నుండి కూడా ఈ సినిమా గురించి వస్తున్న ప్రతి సమాచారం సినిమా పై ఆసక్తిని రెట్టింపు చేస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో నాగ చైతన్యను కాలర్ పట్టుకుని దగ్గరకు లాగుతూ..
కళ్లు మూసుకుని ప్రేమ తన్మయం పొందుతున్న సాయి పల్లవి లుక్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటివరకు విడుదల చేసిన పోస్టర్స్ బట్టి చూస్తే.. ఈ మూవీలో నాగ చైతన్య-సాయిపల్లవిల మధ్య రొమాన్స్ బాగానే వర్కౌట్ అయినట్లు అనిపిస్తుంది. వీరి లవ్ స్టోరీ ప్రేక్షకులను కూడా ఫిదా చేస్తుందని ఆశిస్తున్నారు. ఇప్పటికే 'లవ్ స్టోరీ'కి సంబంధించిన శాటిలైట్, డిజిటల్, హిందీ డబ్బింగ్ హక్కులు భారీ మొత్తానికి సేల్ అయ్యాయట. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు మొదటి వారంలో స్టార్ట్ చేయాలనీ చిత్రయూనిట్ ప్లాన్. కేవలం 15% షూటింగ్ మిగిలి ఉన్న షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో ఫినిష్ చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాను ఏషియన్ డిస్ట్రిబ్యూటర్స్ వారు నిర్మిస్తున్నారు. మరి కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో నిజంగా ఆగష్టులో ఈ సినిమా పట్టాలెక్కనుందా.. అనేది తెలియాల్సి ఉంది.