Begin typing your search above and press return to search.
పారిశుద్ధ్య కార్మికులకు అండగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల...!
By: Tupaki Desk | 7 May 2020 1:20 PM ISTసమ్మర్ వచ్చిందంటే చాలు సూర్యుడు ఇళ్లలో కూర్చొని ఉన్నా తన ప్రతాపం చూపిస్తూ ఉంటాడు. అలాంటిది పగలంతా రోడ్ల మీదే గడిపేవారి పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ప్రజా సేవ కోసం ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్లపైనే పని చేస్తున్న పారిశుద్ద కార్మికుల గురించి ఆలోచించండి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా లాక్ డౌన్ వల్ల పోలీసులు, వైద్యులు, పారిశుద్ద కార్మికులు, జర్నలిస్టుల ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు. ప్రజాసేవ కోసం ధైర్యంగా ముందుకు వచ్చి పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సహాయ పడాలని డైరెక్టర్ శేఖర్ కమ్ముల ముందుకొచ్చాడు. వేసవికాలంలో మండుటెండలను చూడకుండా పరిశుభ్రతకు పాటుపడుతున్న వారికి మజ్జిగ, కూల్ డ్రింక్స్, బాదాం మిల్క్ లాంటివి అందించాలని నిర్ణయం తీసుకొన్నారు. గత నెల రోజులుగా శేఖర్ కమ్ముల ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు బాదం పాలు.. మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో విజయ డైరీ మరియు జీహెచ్ఎంసీ అధికారుల సహాయం తో హైదరాబాద్ జంట నగరాల్లో డైలీ సుమారు 1000 మంది పారిశుద్ధ కార్మికులకు చల్లటి పానీయాలు అందిస్తూ వస్తున్నారు శేఖర్ కమ్ముల.
ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ కార్యక్రమం ప్రతీరోజు సాగుతుంటే.. కర్నూల్ పట్టణ పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఇలాగే పంపిణీ చేసేందుకు రంగం సిద్దం చేశారు శేఖర్ కమ్ముల. దీని గురించి ఆయన స్వయంగా తన ఫేస్ బుక్‌లో పోస్ట్ చేశారు. కరోనా లాక్ డౌన్ లో అందరూ ఇంటికే పరిమితమైతే.. పారిశుద్ధ కార్మికులు మాత్రం రోజంతా రోడ్లపై పనిచేస్తున్నారు. ఎండలో వారు పనిచేస్తున్న తీరు చూసి బాధనిపించిందని.. వారికి ఎంతైనా కొంత సేవల చేయాలనే కోరికతో ఈ నిర్ణయం తీసుకొన్నానని చెప్పుకొచ్చారు. రెడ్ జోన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు తమ లైఫ్ రిస్క్ చేసి మరీ పని చేస్తున్నారని.. ఇంత ఎండల్లో పారిశుద్ధ్య కార్మికులు రాత్రి పగలు యుద్ధం చేసినట్టు రెస్ట్ లేకుండా పని చేస్తున్నారని వారిని కొనియాడారు. వాళ్ళకి మనం ఏం చేసినా తక్కువే.. ప్రతిరోజు బాదం పాలు మజ్జిగ ఇస్తే ఈ ఎండల్లో వడ దెబ్బ తగలకుండా ఎంతో కొంత సపోర్ట్ చేస్తుంది అనిపించిందని.. అందుకే ఈ కార్యక్రమానికి పూనుకున్నానని తెలియజేసాడు.
అంతేకాకుండా కర్నూల్ మున్సిపల్ కార్పోరేషన్ వాళ్ళతో మాట్లాడి అక్కడ కూడా ఈ సేవా కార్యక్రమం మొదలు పెట్టామని.. ఇప్పటికే కర్నూల్ మున్సిపల్ సిబ్బంది విజయవంతంగా బాదంపాలు, మజ్జిగ అందిస్తున్నారని అన్నారు. ఎవరికైనా ఇంటరెస్ట్ ఉంటే.. మీ ఏరియాలో ఉండే విజయ డైరీ లేదా ఏదో ఒక సంస్థతో మాట్లాడుకుని.. ఆ ప్రాంతం అధికారుల ద్వారా పారిశుద్ధ్య కార్మికులకో వలస కార్మికులకో సపోర్ట్ చేయండి.. ఒకరే ఖర్చు భరించలేకపోతే ఇతరుల నుండి విరాళాలు సేకరించి తమ చుట్టుపక్కల ఉండే కార్మికుల తోచినంతగా సహాయం చేయాలని శేఖర్ కమ్ముల కోరారు. ఏదేమైనా శేఖర్ కమ్ముల స్టార్ట్ చేసిన ఈ బృహత్కర కార్యక్రమాన్ని అందరూ మెచ్చుకుంటున్నారు.