Begin typing your search above and press return to search.

రష్మికతో అక్కడే లవ్ స్టొరీ స్టార్ట్!

By:  Tupaki Desk   |   8 Jun 2019 4:20 PM IST
రష్మికతో అక్కడే లవ్ స్టొరీ స్టార్ట్!
X
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూరోప్ టూర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ టూర్ నుంచి తిరిగి రాగానే మహేష్ తన నెక్స్ట్ సినిమా 'సరిలేరు నీకెవ్వరు' షూటింగ్ లో పాల్గొంటాడు. 'ఎఫ్ 2' ఘనవిజయంతో ఫుల్ జోష్ లో ఉన్న అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకుడు. అనిల్ ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ తో బిజీగా ఉన్నాడట.

ఇదిలా ఉంటే ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ బైటకు వచ్చింది. ఈ సినిమాలో మహేష్ ఒక ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే కదా. మహేష్ ఒకసారి కాశ్మీర్ నుంచి ఆంధ్రాకు తిరుగు ప్రయాణం చేసే సమయంలో హీరోయిన్ రష్మిక మందన్నతో లవ్ లో పడతాడట. ఇదంతా ట్రైన్ జర్నీ నేపథ్యంలో బ్యూటిఫుల్ గా సాగుతుందనే టాక్ వినిపిస్తోంది. ట్రైన్ జర్నీ నేపథ్యంలో లవ్ ట్రాక్ ఉండే సినిమాలకు ఒక ప్రత్యేకమైన ఫీల్ ఉంటుంది. ఆ ఫీల్ తీసుకొచ్చేలా రావిపూడి ఈ లవ్ ట్రాక్ ను కొత్తగా డిజైన్ చేశాడట.

మహేష్ ఈమధ్య చేసినవన్నీ మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలే. కానీ ఈసారి మాత్రం 'దూకుడు' తరహాలో ఒక పక్కా కమర్షియల్ ఎంటర్టెయినర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారట. అనిల్ రావిపూడి కమర్షియల్ ఎంటర్టెయినర్లను మలచడంలో స్పెషలిస్ట్ కాబట్టి ఈసారి మహేష్ నుంచి మనం పూర్తి వినోదం ఆశించవచ్చు.