Begin typing your search above and press return to search.

తమన్నాతో పాటు ఆ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు

By:  Tupaki Desk   |   30 Sept 2020 3:00 PM IST
తమన్నాతో పాటు ఆ సినిమాలో మరో ఇద్దరు ముద్దుగుమ్మలు
X
ఈమద్య కాలంలో వరుసగా సినిమాలు చేస్తున్న నటుడు సత్యదేవ్‌. హీరోగానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా నటిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. నటనకు ఆస్కారం ఉన్న ప్రతి పాత్రను చేస్తున్న ఈయన ఈ లాక్‌ డౌన్‌ లో ఉమామహేశ్వర ఉగ్రరూపస్య సినిమాతో పాటు మరో రెండు సినిమాలను కూడా విడుదల చేసి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఈయన మిల్కీ బ్యూటీ తమన్నాతో కలిసి 'గుర్తుందా శీతాకాలం' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా అధికారికంగా ప్రకటన వచ్చింది. షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాలో తమన్నాతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్‌ ను నటింపజేస్తున్నట్లుగా మీడియా వర్గాల ద్వారా తెలుస్తోంది.

గుర్తుందా శీతాకాలం టైటిల్‌ కొన్నాళ్ల క్రితం నితిన్‌ కోసం అనుకున్నారు. ఏవో కారణాల వల్ల ఆ టైటిల్‌ ను వినియోగించలేదు. ఇప్పుడు ఆ టైటిల్‌ తో సత్యదేవ్‌ సినిమా చేస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక తమన్నా ఈ సినిమాలో హీరోయిన్‌ అవ్వడంతో అంచనాలు మరింతగా ఉన్నాయి. ఈ సినిమాలో రెండు ఫీమేల్‌ పాత్రలు కథకు చాలా కీలకం. అందుకే ఆ పాత్రలకు హీరోయిన్స్‌ ప్రియా భవానీ శంకర్‌ మరియు రితికా సింగ్ లను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది. ముగ్గురు ముద్దుగుమ్మలతో ఖచ్చితంగా సినిమా కలర్‌ ఫుల్‌ గా ఉంటుందనిపిస్తుంది. కన్నడ సూపర్‌ హిట్‌ అయిన లవ్‌ మోక్‌ టైల్‌ కు ఇది అఫిషియల్‌ రీమేక్‌. నాగ శేఖర్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది.