Begin typing your search above and press return to search.

ల‌వ్ బ్రహ్మాస్త్రం.. ర‌ణ‌బీర్ మాయ‌లో ఆలియా

By:  Tupaki Desk   |   14 Feb 2022 2:17 AM GMT
ల‌వ్ బ్రహ్మాస్త్రం.. ర‌ణ‌బీర్ మాయ‌లో ఆలియా
X
బాలీవుడ్ లో సిస‌లైన ప్రేమ‌జంట‌గా ఇప్పుడు ర‌ణ‌బీర్ - ఆలియా జంట పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఒక‌రిని విడిచి ఒక‌రు ఉండ‌లేనంత సాన్నిహిత్యం ఆ ఇద్ద‌రి న‌డుమా ఉంది. అన్నీ స‌రిగా కుదిరితే ఈపాటికే పెళ్ల‌య్యేది. కానీ ఎందుక‌నో అంత‌కంత‌కు ఆల‌స్య‌మ‌వుతోంది. ఇరువురు తార‌లు కెరీర్ ప‌రంగా బిజీగా ఉండ‌డ‌మే గాక .. ఇత‌ర అడ్డంకుల వ‌ల్ల కూడా పెళ్లి వాయిదా ప‌డుతోంది.

ఇక ర‌ణ‌బీర్ - ఆలియా జంట ప్ర‌స్తుతం బ్ర‌హ్మాస్త్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 9 సెప్టెంబర్ 2022న థియేటర్లలో విడుదల కానుంది. వాలెంటైన్స్ డేకి రోజు ముందే బ్రహ్మాస్త్ర నిర్మాతలు ఈ భారీ బడ్జెట్ చిత్రం నుండి సరికొత్త స్టిల్ ను విడుదల చేశారు. రణబీర్ కపూర్ -ఆలియా జంట ఈ స్టిల్ లో ఎంతో ప్రేమైక భావ‌న‌తో క‌నిపించారు. ఈ కొత్త స్టిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. రొమాంటిక్ క‌పుల్ తమ మారిన గెట‌ప్ ఈ ఫోటోలో క‌నిపిస్తోంది. ఇది సినిమాలోని ఓ పాటలోని స్టిల్ అని తెలుస్తోంది.

సినిమా గురించి ఇతర వివ‌రాల్లోకి వెళితే.. బ్రహ్మాస్త్రలో అమితాబ్ బచ్చన్- అక్కినేని నాగార్జున- షారూఖ్ ఖాన్- డింపుల్ కపాడియా- మౌని రాయ్ త‌దిత‌రులు ముఖ్యమైన పాత్రల్లో నటించారు. ఇది సూపర్ హీరో కాన్సెప్ట్ తో వ‌స్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం. ఫ్రాంచైజీ లో మొదటి భాగం హిందీ- తెలుగు- తమిళం- కన్నడ- మలయాళంలో 3D వెర్ష‌న్ తో పాటు IMAX ఫార్మాట్లలో విడుదల కానుంది. ప్ర‌స్తుతం స్థానిక భాష‌ల్లోకి ఈ చిత్రం అనువాద‌మ‌వుతోంద‌ని స‌మాచారం.

ఆలియా పెళ్లి ఇంత‌కీ ఎప్పుడు?

ర‌ణ‌బీర్ - ఆలియా జంట‌ గ‌త కొంత కాలంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ అలియాభ‌ట్‌.. ర‌ణ్‌బీర్ క‌పూర్ ఏదో ఒక సంద‌ర్భంలో జంట‌గా క‌నిపించి సంద‌డి చేస్తూనే వున్నారు. ఇంత‌కుముందు అలియాభ‌ట్ ప్రియుడు.. హీరో ర‌ణ్‌బీర్ క‌పూర్ తో క‌లిసి బీచ్ లో కూర్చుని స‌న్ లైట్‌ని ఎంజాయ్ చేస్తున్న ఓ ఫొటోని షేర్ చేయ‌గా.. ఇక పెళ్లికి స‌మ‌యం వ‌చ్చిన‌ట్టేన‌ని టాక్ వినిపించింది. 2021 సెప్టెంబ‌ర్ 28న ర‌ణ్ బీర్ క‌పూర్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా అత‌నికి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు అంద‌జేస్తూ అలియాభ‌ట్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసిన ఫొటో వీక్షించాక‌ త్వ‌ర‌లోనే వీరు పెళ్లి చేసుకోబోతున్నార‌నే సంకేతాల్ని అందిస్తోంద‌ని గుస‌గుస వినిపించింది. గ‌త ఏడాది కాలంగా వీరిద్ద‌రిపై బాలీవుడ్ లో రూమ‌ర్‌లు వినిపిస్తూనే వున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు ఆ రూమ‌ర్‌ల‌కి త‌గ్గ‌ట్టుగా అలియా .. ర‌ణ్‌బీర్ క్లోజ్‌గా వున్న త‌మ‌ ఫొటోల‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా మ‌రిన్ని డౌట్లు క్రియేట్ చేసారు.

ఆ మ‌ధ్య ఓ ఇంట‌ర్వ్యూలో త‌మ పెళ్లి గురించి వివ‌రించి షాకిచ్చాడు ర‌ణ్ బీర్‌. పాండ‌మిక్ కి ముందే త‌మ పెళ్లికి డేట్ కుదిరింద‌ని.. అయితే కోవిడ్ కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంద‌ని వివ‌రించాడు. అయితే తాజాగా వీరి వెడ్డింగ్ కి డేట్ ఫిక్స్ అయింద‌ని.. వెడ్డింగ్ వెన్యూ కోసం ఇటీవ‌లే జోధ్ పూర్ లోని అత్యంత సుంద‌ర‌మైన ప్రదేశాల‌ని ర‌ణ్‌బీర్‌.. అలియా ఇద్ద‌రూ క‌లిసి వెళ్లార‌ని.. అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేయ‌డం షాకిచ్చింది. అన్నీ స‌వ్యంగా కుదిరితే ఈ ఏడాది ఎండింగ్‌లోనే వీరి వివాహం జ‌ర‌గ‌నుంద‌న్న టాక్ వినిపించింది.

గత సంవత్సరం మహమ్మారి లేకపోతే తాను ఆలియా వివాహం చేసుకునేవాళ్ల‌మ‌ని రణబీర్ వెల్లడించాడు. మాజీ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ తో రణ్‌బీర్ మాట్లాడుతూ.. “మహమ్మారి మన జీవితాలను తాకకపోతే ఈపాటికే పెళ్లి అయ్యేది. కానీ నేను ఏదో ఒక‌టి చెప్పడం ద్వారా హ‌డావుడి చేయ‌ను. నా జీవితంలో త్వరలో ఆ లక్ష్యాన్ని గుర్తించాలనుకుంటున్నాను`` అని అన్నారు.

అలియా - రణబీర్ గత మూడు సంవత్సరాలుగా డేటింగ్ చేస్తున్నారు. బ్రహ్మాస్త్ర చిత్రంలో కనిపించనున్న వీరిద్దరూ తరచూ ఒకరి కుటుంబాలతో ఒక‌రు గడపడం కనిపిస్తుంది. ఇటీవల రణబీర్ తన తండ్రి.. చిత్రనిర్మాత మహేష్ భట్ పుట్టినరోజును జరుపుకోవడానికి అలియాతో కలిశాడు. జోధ్ పూర్ లో ప‌ర్యటిస్తూ ఈ జంట పెళ్లి వెన్యూని వెతుకుతోంద‌ని క‌థ‌నాలొచ్చాయి.