Begin typing your search above and press return to search.
ట్రైలర్ టాక్ : గెలిచేంత వరకు ఓడిపోయే ఓపిక ఉండాలి
By: Tupaki Desk | 6 Jan 2022 9:15 AM ISTప్రియదర్శి.. శశాంక్.. కల్పిక.. ఆనీ.. షాయాజీ షిండే కీలక పాత్రల్లో రూపొందిన లూసీజన్ సీజన్ 2 స్ట్రీమింగ్ కు సిద్దం అయ్యింది. లూజన్ మొదటి సీజన్ కు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో అంతకు మించి సస్పెన్స్ థ్రిల్లర్ గా ఆకట్టుకునే ఎలిమెంట్స్ తో లూజర్ సీజన్ 2ను తెరకెక్కించినట్లుగా మొదటి నుండి చెబుతూ వస్తున్నారు. తాజాగా లూజర్ సీజన్ 2 ట్రైలర్ ను విడుదల చేయడం జరిగింది. లూజర్ 2 ను జనవరి 21న స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. జీ 5 లోనే ఈ సీజన్ 2 ను కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు.
ప్రియదర్శి ఈ సీజన్ లో షూటర్ గా కనిపించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ ట్రైలర్ లో ప్రియదర్శి పాత్ర గురించి క్లారిటీ ఇచ్చారు. ట్రైలర్ పూర్తిగా ప్రియదర్శి పాత్రను చూపిస్తూ సాగింది. బెనర్జీ మరియు ప్రియదర్శిలను చూపించారు. గన్ షూటింగ్ ట్రైనింగ్ చేసిన ప్రియదర్శి లూజర్ అయ్యాడా విన్నర్ అయ్యాడా అనేది ఈ సీజన్ చూస్తే అర్థం అవుతుంది. ట్రైలర్ లోని గెలిచేంత వరకు ఓడిపోయే ఓపిక ఉండాలి అంటూ చెప్పిన డైలాగ్ ఆకట్టుకునే విధంగా ఉంది. అభిలాష్ రెడ్డి మరియు శ్రవన్ మడాలాలు లూజర్ సీజన్ 2 కుదర్శకత్వం వహించారు.
అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందిన ఈ థ్రిల్లర్ సిరీస్ కు శ్రీరామ్ మడూరి సనేపథ్య సంగీతం అందించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందడంతో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈమద్య కాలంలో జీ5 లో వరుసగా తెలుగు సినిమాలు మరియు వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
దాంతో తెలుగు నాట కూడా జీ 5 ఓటీటీ కి ఆధరణ పెరుగుతోంది. లూజర్ సీజన్ 2 తో మరింతగా జీ 5 కి ఆధరణ పెరుగుతుందని ఓటీటీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రియదర్శి నటుడిగా ఇప్పటికే మంచి గుర్తింపును దక్కించుకున్నాడు. ఓటీటీ కంటెంట్ అంటే నట విశ్వరూపం చూపించే అవకాశం ఉంది.. హద్దులు లేకుండా నటించే అవకాశం ఉంటుంది. కనుక ప్రియదర్శి ఈ సిరీస్ లో మరోసారి నటుడిగా తనను తాను ఆవిష్కరిస్తాడనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.