Begin typing your search above and press return to search.

సినిమాలలో శివుడికి స్పెషల్ రోల్

By:  Tupaki Desk   |   7 March 2016 10:38 AM IST
సినిమాలలో శివుడికి స్పెషల్ రోల్
X
ముక్కంటి.. ముక్కోపి.. తిక్క శంకరుడు.. అని నిందించినా... హే ఈశ్వరా.. సర్వ లోకేశ్వరా అని స్తుతించినా పలికి, కరిగి ప్రసన్నమయ్యే ఏకైక దేవుడు శివుడు. అందుకే అందరికంటే శివుడే ప్రియం. మన సినిమాలకు సైతం శివుడి స్థానమే ప్రధమం.

అవును దేవుడి నేపధ్యాలలో వచ్చిన సినిమాలలో శివుడి కే ఎక్కువ ప్రాధాన్యత కలిగి వుండడం విశేషం. 80-90లలో శివుడి పాత్రలలో వచ్చిన సినిమాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి ఈ ఈశ్వరుడి బ్యాక్ డ్రాప్ లో రెండు సినిమాలలో నటించాడు. శ్రీ మంజునాధలో శివుడిగా కనిపించిన శివుడు - అంజి సినిమాలో ఆత్మలింగ సాధనలో శ్రమిస్తాడు.

మరో పెద్ద హీరో నాగార్జున కూడా డమరుకం సినిమాలో శివుడి నేపధ్యంలో కధను నడిపిస్తాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ శివుడిగా కనిపిస్తాడు. లేటెస్ట్ గా బాహుబలి చిత్రంలో హీరో పాత్ర పేరు శివుడు. శివలింగం ఎత్తుకున్న నేపధ్యం, ఆ పాట సినిమా కే ప్రధాన ఆకార్షణ. హీరోల నుండీ విలన్ లకు ఎంతో ప్రీతిపాత్రుడైన శివుడిని స్మరించుకుంటూమహా శివరాత్రి శుభాకాంక్షలు.