Begin typing your search above and press return to search.
'మిస్ ఇండియా'ని చిన్న చూపు చూస్తున్నారా..?
By: Tupaki Desk | 4 Nov 2020 5:00 AM ISTనేషనల్ అవార్డు విన్నింగ్ హీరోయిన్ కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ''మిస్ ఇండియా''. తెలుగు తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రానికి నరేంద్ర నాథ్ దర్శకత్వం వహించారు. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై మహేష్ కోనేరు నిర్మించారు. నవీన్ చంద్ర - జగపతి బాబు - రాజేంద్ర ప్రసాద్ - సీనియర్ నరేష్ - నదియా - కమల్ కామరాజ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన 'మిస్ ఇండియా' ట్రైలర్ బాగానే ఆకట్టుకుంది. ఏప్రిల్ 17న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా పరిస్థితుల కారణంగా వాయిదాపడి డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయింది. అయితే మరో రెండు రోజుల్లో(నవంబర్ 4) నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో 'మిస్ ఇండియా' విడుదల అవుతుందనే విషయం సాధారణ సినీ ప్రేక్షకులకు తెలియడం లేదని అంటున్నారు.
'మిస్ ఇండియా' మూవీ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ అమ్మాయి చిన్నతనం నుంచి వ్యాపార రంగంలో రాణించాలని కలలు కంటూ.. చివరకు తాను అనుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకుందనే కథాంశంతో రూపొందిందని తెలుస్తోంది. నిజానికి ఈ సినిమా టైటిల్ పోస్టర్ చూసి అందానికి సంబంధించిన సినిమా అయ్యుంటుందేమోనని అందరూ భావించారు. కానీ ట్రైలర్ విడుదలైన తర్వాత పారిన్ లో టీ బిజినెస్ స్టార్ట్ చేసి సక్సెస్ అయ్యే యువతి కథ అని తెలుసుకున్నారు. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ చేసే డేట్ ఎనౌన్స్ చేసినా అది ఎక్కువమందికి చేరువ కాలేదనే టాక్ నడుస్తోంది.
కీర్తి సురేష్ నటించిన 'పెంగ్విన్' సినిమా కూడా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. మరి ఈ కారణం చేతనో.. ప్రమోషన్స్ బాగా చేయకపోవడం వల్లనో.. డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అనే సరికి అంతా చిన్న చూపు చూడటం వల్లనో 'మిస్ ఇండియా' విడుదల అవుతుందనే విషయం సామాన్య సినీ అభిమానులకి తెలియలేదని ఫిలిం సర్కిల్స్ లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'మహానటి' కీర్తి సురేశ్ నుంచి వస్తున్న మరో లేడీ ఓరియెంటెడ్ మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.