Begin typing your search above and press return to search.

ఖిలాడీ కోట‌లో క్వీన్ మెరుపులు.. ఎవ‌రీ బ్యూటీ?

By:  Tupaki Desk   |   15 April 2021 2:30 PM GMT
ఖిలాడీ కోట‌లో క్వీన్ మెరుపులు.. ఎవ‌రీ బ్యూటీ?
X
సౌత్ ఇండ‌స్ట్రీలో ఆరంభ‌మే మెగా హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకుంది డింపుల్ హ‌యాతీ. ఈ భామ తొలుత వ‌రుణ్ స‌ర‌స‌న గ‌ద్ద‌ల కొండ గ‌ణేష్ చిత్రంలో సూపర్ హిట్ స్పెషల్ సాంగ్ `జర్రా జర్రా’..` లో కనిపించింది. అటూపై సౌత్ లో ప‌లు చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. అలాగే హిందీ పరిశ్ర‌మ‌లో స్టార్ డైరెక్ట‌ర్ తో ఆఫ‌ర్ ద‌క్కించుకుంది.

ధనుష్, అక్షయ్ కుమార్ .. సారా అలీ ఖాన్ లాంటి క్రేజీ స్టార్ల‌తో రూపొందుతున్న బాలీవుడ్ రొమాంటిక్ డ్రామా `అట్రాంగి రే`లో డింపుల్ ఆఫ‌ర్ ద‌క్కించుకుంది. దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ అమ్మ‌డు న‌టించిన సినిమాల్ని చూసి ఎంపిక చేసుకున్నారు. అట్రాంగిరే లో‌ ధ‌నుష్ స‌ర‌స‌న డింపుల్ క‌నిపించ‌నుంది.

మ‌రోవైపు మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న ఖిలాడీ చిత్రంలోనూ డింపుల్ క‌థానాయిక‌గా న‌టిస్తోంది. ఇంత‌కుముందు రిలీజైన ఖిలాడీ టీజ‌ర్ లోనూ ఈ అమ్మ‌డు మురిపించింది. ఇక డింపుల్ ఇంత‌కుముందు గ‌ల్ఫ్ అనే తెలుగు చిత్రంలో న‌టించినా అంత‌గా గుర్తింపు రాలేదు. ఇప్పుడు మాస్ రాజాతో ఈ అమ్మ‌డికి బ్రేక్ ల‌భిస్తుందేమో చూడాలి. ఈ చిత్రంలో డింపుల్ తో పాటు మీనాక్షి చౌద‌రి మ‌రో నాయిక‌. తాజాగా డింపుల్ కొత్త లుక్ సోష‌ల్ మీడియాల్లో రిలీజ్ కాగానే ఖిలాడీ కోట‌లో ప్రిన్సెస్ అంటూ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. ఈ ఫోటోని జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.